Bramayugam Advance Booking Collections గ్రాండ్‌గా మమ్ముట్టి మూవీ అడ్వాన్స్ బుకింగ్.. భ్రమయుగం కలెక్షన్లు ఎంతంట

దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భ్రమయుగం. ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఏ దేశాల్లో ఏ మేరకు వసూళ్లు నమోదయ్యాయనే విషయంలోకి వెళితే..

భ్రమయుగం సినిమా విషయానికి వస్తే.. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. కలర్‌లో కాకుండా బ్లాక్ అండ్ వైట్ సినిమాగా రూపొందుతున్నది. ఈ సినిమాలో నటించిన మమ్ముట్టి రెమ్యునరేషన్‌తోపాటు ఈ సినిమాకు 28 కోట్ల మేర బడ్జెట్‌ను ఖర్చు చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Bramayugams Advance Booking Collections Worldwide: Mammootty Movie Good start at Overseas Box Office

ఇక భ్రమయుగం సినిమాకు ప్రమోషన్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీని అత్యధిక థియేటర్లలో, అలాగే ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మూడు రోజులు ఉండగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను మలయాళం, యూకే, యూఏఈ, గల్ఫ్ దేశాల్లో ప్రారంభించారు.

యూఏఈ, గల్ప్ దేశాల్లో భ్రమయుగం సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ మూవీకి వాక్స్ సినిమాస్, నోవో సినిమాస్, స్టార్ సినిమాస్, సిని పోలీస్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 48 లోకేషన్లలో 162 షోలు ప్రదర్శిస్తుండగా ఇప్పటికీ 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాకు 11K అమెరికన్ డాలర్లు అంటే 9.12 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.

Bramayugams Advance Booking Collections Worldwide: Mammootty Movie Good start at Overseas Box Office

ఇక భ్రమయుగం సినిమాకు యూకే, ఐర్లాండ్ దేశాల్లో మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాను యూకేలో సినీ వరల్డ్, ఓడియన్, వ్యూ సినిమాస్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను 63 లోకేషన్లలో 76 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఐర్లాండ్‌లో 5 లోకేషన్లలో 6 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. యూకేలో 2600 పైగా టికెట్లు, ఐర్లాండ్‌లో 200 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X