Bro Movie Collections బ్రో మూవీకి షాకింగ్‌గా ఓపెనింగ్స్.. పవన్ కల్యాణ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో బ్రో ది అవతార్ సినిమా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా వారియర్, కేతిక శర్మ, ఊర్వశి రౌటేలా, రోహిణి తదితరులు నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత అనే విషయంలోకి వెళితే..

బ్రో ది అవతార్ (BRO The Avatar) సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటించినందుకు పవన్ కల్యాణ్‌కు సుమారు 50 కోట్ల రూపాయల రెమ్యురేషన్ ఇవ్వడం తెలిసిందే. ఇక మిగితా ఆర్టిస్టుల పారితోషికంతోపాటు ప్రొడక్షన్స్ పరంగా మొత్తంగా 100 కోట్లకుపైగా బడ్జెట్‌‌తో సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Bro The Avatar

బ్రో ది అవతార్ (BRO The Avatar) మూవీ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేశారు. నైజాంలో ఈ సినిమా 30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. సీడెడ్‌లో 13 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 9.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లా హక్కులు 6.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 5.4 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.3 కోట్లు, కృష్ణా జిల్లాలో 6 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.5 కోట్ల రూపాయలతో కలిపి 80 కోట్ల రూపాయలుగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు అయింది.

ఇక బ్రో ది అవతార్ (BRO The Avatar) తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా 95 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 97 కోట్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Bro The Avatar

బ్రో ది అవతార్ (BRO The Avatar) సినిమాకు మంచి ఒపెన్సింగ్స్ లభించాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఇక తొలి రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 80 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 85 శాతం, సెకండ్ షోకు 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

బ్రో ది అవతార్ (BRO The Avatar) మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారీగా ఓపెనింగ్స్ లభించాయి.అమెరికాలో ప్రీమియర్లను 256 లోకేషన్లలో ప్రదర్శించారు. యూఎస్‌లో 550K డాలర్లకుపైగా, కెనడాలో 70 వేల డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో మొత్తంగా 650K వసూళ్లను రాబట్టింది.

Bro The Avatar

ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. నైజాంలో 8 కోట్ల రూపాయలు, ఏపీలో 15 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళనాడు, మిగితా రాష్ట్రాల్లో కలిపి 5 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X