Bro The Avatar Day 2 collections పవన్ కల్యాణ్ మూవీ కలెక్షన్ల జోరు.. 50 కోట్ల క్లబ్‌లో బ్రో మూవీ!
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన బ్రో చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళంలో వినోదయ సీతమ్ మూవీ ఆధారంగా రూపొందిన బ్రో ది అవతార్ సినిమా సుమారు 140 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 95 కోట్లకుపైగా నమోదైంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ భారీగానే సెట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన బ్రో ది అవతార్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు.

బ్రో ది అవతార్ సినిమా స్క్రీన్ కౌంట్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో 350 స్క్రీన్లు, సీడెడ్‌లో 250 స్క్రీన్లు, ఆంధ్రాలో 450 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో 600 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో మొత్తంగా ఈ సినిమాను 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

బ్రో ది అవతార్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా ప్రదేశ్, తెలంగాణలో 35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను, మిగితా రాష్ట్రాల్లో 75 లక్షలు, ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 30 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

బ్రో ది అవతార్ సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. రెండో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 80 శాతం, ఫస్ట్ షోకు 85 శాతం, సెకండ్ షోకు 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
బ్రో ది అవతార్ సినిమా రెండో రోజు కూడా బాక్సాఫీస్ స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ సినిమా రెండో రోజు 20 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ వసూళ్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











