twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రూస్ లీ: టేబుల్ ఫ్రాఫిట్స్ ...ఎంతంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో రామ్ చరణ్, నిర్మాత, దర్శకుడు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ram charan

    చిరంజీవి మాట్లాడుతూ...బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు.

    రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేసినట్లు సమాచారం.

    charan

    రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    vaitla

    English summary
    Ram Charan, Rakul Preet Singh's ‘Bruce Lee’ is doing sensational business and according to the latest it is coming out that film makers already got Rs10crs table profits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X