Bubblegum Closing Collections: యాంకర్ సుమ కొడుకు మూవీకి లాభమా? నష్టమా? బబుల్‌గమ్ క్లోజింగ్ కలెక్షన్లు ఇవే!

ప్రముఖ యాంకర్, యాక్టర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తమ కుమారుడిని తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం బబుల్‌గమ్. టాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన యూత్‌‌ఫుల్ ప్రేమకథా చిత్రంలో మానస చౌదరీ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, బిజినెస్, ఓవరాల్‌గా మూవీ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దర్శకుడు రవికాంత్ పేరుపు రూపొందించిన బబుల్‌గమ్ చిత్రంలో హర్షవర్ధన్, తేజా జొన్నలగడ్డ, హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించారు. ఆర్టిస్టులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 5 కోట్ల రూపాయలుగా వ్యాల్యూ కట్టారు.

Bubblegum Closing Collections Collections Worldwide: Anchor Suma Son Roshan Kanakala Movie Final box office report

బబుల్‌గమ్ సినిమా టీజర్, ట్రైలర్‌కు యూత్ నుంచి క్రేజ్ రావడంతో ఈ మూవీని భారీగానే రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 800 స్క్రీన్లలో, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో 500 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు. 5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

రోషన్ నటించిన బబుల్‌గమ్ సినిమా ఫర్వాలేదనే విధంగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి చిత్ర హీరోగా నటించిన సినిమాలతో పోల్చితే బాక్సాఫీస్ వద్ద ఒకే అనిపించాయి. సుమ, రాజీవ్ కనకాలకు ఉన్న పాపులారిటీతో తొలి రోజు 50 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Bubblegum Closing Collections Collections Worldwide: Anchor Suma Son Roshan Kanakala Movie Final box office report

బబుల్‌గమ్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే 45 లక్షలు, మూడో రోజు 53 లక్షలు, నాలుగో రోజు 47 లక్షలు, ఐదో రోజు 20 లక్షలు, ఆరో రోజు 15 లక్షలు, ఏడో రోజు 10 లక్షల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. ఆ సినిమా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

బబుల్‌గమ్ చిత్రం ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ట్రేడ్ వర్గాల వాల్యూ ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించకుండా బాక్సాఫీస్ జర్నీని ముగించింది. 5 కోట్ల రూపాయల షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన ఈ సినిమా 2 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో థియేట్రికల్‌గా సుమారు 3 కోట్ల రూపాయల నష్టంతో ముగిసిందని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X