»   » పూరీ జగన్ 'బుడ్డా' ఫైనల్ రిజల్ట్

పూరీ జగన్ 'బుడ్డా' ఫైనల్ రిజల్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్, అమితాబ్ కాంబినేషన్ లో రూపొందిన 'బుడ్డా' చిత్రం చివరకు కలెక్షన్స్ పరంగా చాలా పూర్ గా ఉన్నట్లు బాలీవుడ్ బాక్సాఫీస్ తేల్చేసింది. సౌత్ మీడియా తప్ప ఈ సినిమాని ఎవరూ మోయటం లేదని పెదవి విరిచింది. అందులోనూ మొదటి వారం ఈ చిత్రానికి పోటీగా రిలీజైన డిల్లీ బెల్లీ మాత్రం కలెక్షన్స్ లో అదరకొట్టింది.దాదాపు 1200 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎనభై పర్శంట్ వరకూ షేర్ కలెక్ట్ చేసింది. అయితే బుడ్డా చిత్రం మాత్రం కేవలం ధర్టీ పర్శంట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇప్పుడు ఈ చిత్రాల కలెక్షన్స్ ని దెబ్బ కొడుతూ మర్డర్ 2 రంగంలోకి దిగి వీకెండ్ లో మంచి పోటీనే ఇచ్చింది. దాంతో మరింతగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని, అయితే శాటిలైట్ రైట్స్ బాగా రావటం, తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేయటం సినిమా ఫెయిల్యూర్ కాకుండా కాపాడిందని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది. అయితే ఈ చిత్రం యావరేజ్ చిత్రంగా పరిగణిస్తున్నారు.

English summary
Amitabh Bachchan’s “Buddha Hoga tera Baap” received a thumbs up from all sections of the media as the movie is getting good reviews, which will pave way for the good collections. But the movie “Delhi Belly’ has spoilt the smooth run of the big b film at Bollywood box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu