పూరీ జగన్నాధ్ లేటెస్ట్ చిత్రం శాటిలైట్ రైట్స్ పదమూడున్నర కోట్లు
దర్శకుడు పూరీ జగన్నాధ్, అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా హోగయా తేరా బాప్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మంచి బిజెనెస్ చేసినట్లు సమాచారం.ముఖ్యంగా ఈ చిత్రం టేబుల్ ప్రాఫిట్ ని సంపాదించి పెట్టిందని అమితాబ్ చెప్తున్నారు. అమితాబ్ ఈ విషయం ట్విట్టర్ లో రాస్తూ...ఈ చిత్రం పదిన్నర కోట్ల పరిమిత బడ్జెట్ తో నిర్మితమైంది. అయితే పదమూడున్నర కోట్లు శాటిలైట్ రైట్స్ తెచ్చిపెట్టి మూడు కోట్లు టేబుల్ ప్రాఫెట్ తెచ్చిపెట్టింది అన్నారు. ఈ చిత్రం కోసం వదిలిన ప్రోమోలు అంతటా మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే దానికి కారణం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ..'నువ్వు ముసలాడివి' అని ఎవరైనా అంటే వాళ్ల తాట తీస్తాను. ఆ మాటే అంటే అస్సలు నచ్చదు.'బుడ్డా...ఓ కొత్త తరహా సినిమా. అందులో నేను పెద్ద డాన్‌ని. తమాషాగా ఉంటూనే సీరియస్‌గా సాగుతుంది అన్నారు.అలాగే అలాగే ఈ సినిమా చేయడానికి చాలా విషయాలు నన్ను పురిగొల్పాయి. కేవలం నా ఒక్క పాత్ర కోసమే కాదు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తప్పకుండా నా అభిమానులకు నచ్చుతుంది అని బిగ్ బి మురిసిపోతూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











