For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బారులు తీరిన బడ్జెట్‌ సిన్మాలు

  By Staff
  |

  పెద్ద హీరోల సినిమాలు షూటింగ్‌లో ఉంటే చిన్న చిత్ర నిర్మాతలకు అది పండుగ లాంటిదే. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి స్టాలిన్‌, యువరత్న బాలకృష్ణ లలితకళాంజలి చిత్రంలో, యువసమ్రాట్‌ నాగార్జున బాస్‌, వెంకటేష్‌ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. చిత్రాలతో బిజీగా ఉండగా మిగిలిన హీరోల సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగులు జరుపుకుంటున్నాయి. ఫలితంగా ఈ గ్యాప్‌ని ఉపయోగించుకుని అనేక చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమైపోయాయి.

  శ్రావణమాసం, ఆపై పెద్దగా పోటీ లేకపోవడం కారణంగా చిన్న చిత్రాల నిర్మాతలందరూ జనం మీదకు తమ సినిమాలను వదలడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటగా ఆగస్టు 11న వరుసగా పలు చిత్రాలు లైన్‌ కట్టాయి. ఇవన్నీ లోబడ్జెట్‌ చిత్రాలే.

  జగపతిబాబు, నేహా ఒబెరాయ్‌ నటించిన బ్రహ్మాస్త్రం శుక్రవారంనాడు విడుదలవుతోంది. సత్యం సినిమా తరువాత ఆకాశంలో విహరించి, ధన 51 ఫ్లాప్‌ తర్వాత మళ్లీ నేలలో కూరుకుపోయిన దర్శకుడు సూర్యకిరణ్‌ బ్రహ్మాస్త్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాపై జగపతిబాబుకు ఎలాంటి ఆశలూ లేకపోవడం గమనార్హం. నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు మాత్రం బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

  ఎవిఎస్‌ దర్శకత్వంలో సిసి రెడ్డి నిర్మించిన రూమ్‌మేట్స్‌ కూడా విడుదలవుతోంది. నరేశ్‌, నవనీత్‌కౌర్‌, బాలాదిత్య, సుమన్‌శెట్టి, శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణంగా విడుదలవుతున్న ఈ చిత్రం మీద ఎవ్వరికీ ఎటువంటి అంచనాలు లేవు. ఇంతవరకూ దర్శకునిగా మూడు సినిమాలు (సూపర్‌ హీరోస్‌, అంకుల్‌, ఓరి నీ ప్రేమ బంగారం కానూ..) తీసి బాక్సాఫీసు వద్ద మూడుసార్లు బోల్తా కొట్టిన హాస్యనటుడు ఏవిఎస్‌ నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

  రెండేళ్ల కిందటే పూర్తయి బయ్యర్లు లేక అటకెక్కేసిన విజయశాంతి సినిమా నాయుడమ్మ కూడా ఆగస్టు 11న విడుదలవుతోంది. గతంలో కూడా ఇలా ఒకటి రెండు సార్లు డేట్లు ఇచ్చినా నాయుడమ్మ చిత్రం విడుదల కాలేదు. ఈసారి చిత్రాన్ని విజయశాంతి స్వంతంగా విడుదల చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో విజయశాంతి ద్విపాత్రాభినయం చేస్తుండగా ప్రభుదేవా, రేఖ కీలకమైన పాత్రలు పోషించారు.

  ఆర్‌. నారాయణమూర్తికి సహజంగానే ఒక అభిమానవర్గం ఉంది. ఆయన ఏ సినిమాలు తీసినా మినిమమ్‌ ప్రేక్షకులు ఆయనకు ఉన్నారు. ఆయన కొంతకాలం కిందట రూపొందించిన అడవి బిడ్డలు సెన్సార్‌ చిక్కుల్నించి బయటపడి ఎట్టకేలకు ఆగస్టు 11నే విడుదలకు నోచుకుంటోంది.

  కమేడియన్‌ సునీల్‌ హీరోగా ఆర్తీ అగర్వాల్‌ జంటగా నటించిన అందాల రాముడు 18కి వాయిదా పడగా, అదే రోజు శివాజీ, అంకిత జంటగా శ్యామ్‌ప్రసాద్‌, నిర్మాత యలమంచి రవిచంద్‌ కాంబినేషన్‌లో రూపొందిన సీతారాముడు కూడా విడుదలవుతోంది.

  ఫ్యాక్టరీ అధినేత రామ్‌గోపాల్‌ వర్మ - తమ మొదటి సినిమా - శివను నేటితరానికి అనుగుణంగా రీమేక్‌ చేసి అందిస్తున్న శివ 2006 కూడా ఆగస్టు 25న విడుదలవుతోంది. మోహిత్‌ అహ్లావత్‌, నిషా కొఠారి ఈ చిత్రంలో ప్రధానతారగణం కాగా ఇళయరాజా సంగీత దర్శకుడు.

  మనీ, సిసింద్రీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజాకృష్ణమూర్తి వంటి చిత్రాల దర్శకుడు శివనాగేశ్వరరావు స్వీయనిర్మాణంలో అందిస్తున్న చిత్రం ఫోటో, అందరూ కొత్త తారలతో నిర్మించిన టీనేజ్‌ ప్రేమకథా చిత్రం రామాలయం వీధిలో.. ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

  వరుస వైఫల్యాలతో చతికిలబడ్డ యంగ్‌ హీరో నితిన్‌ తాజా చిత్రం సత్యం, శివం, సుందరం .. కూడా ఈనెల చివరిలో విడుదలవుతోంది. సిద్ధిక్‌ దర్శకుడు. ఇంకా బ్రహ్మాజీ హీరోగా గణా, శివబాలాజీ అగంతకుడు, రంభ ప్రధానపాత్రలో కొత్తకథ, కొత్త తారాగణంతో కొంటె కుర్రాళ్లు, మరికొన్ని డబ్బింగ్‌ అనువాద చిత్రాలు ఈ నెలలోనే ప్రేక్షకుల తీర్పు కోరుతున్నాయి.

  మరిన్నికథనాలు

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X