‘ఈరోజుల్లో’ సాటిలైట్ రైట్స్ కోసం బంపర్ ఆఫర్!
విభిన్న కథాంశంతో, పూర్తిగా కొత్తనటులతో వచ్చిన 'ఈరోజుల్లో' చిత్రం విడుదల రోజు నుంచే సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. అత్యంత లోబడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఎక్కడలేని కలెక్షన్లు కురుస్తున్నాయి.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ సమాచారం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈచిత్రం శాటిలైట్ రైట్స్ సినిమా విడుదలకు ముందే రూ. 30 లక్షలకు అమ్మినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వస్తుండటంతో ఆ చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న వ్యక్తికి రూ. 2 కోట్లకు ఆఫర్ చేసిన మళ్లీ దాన్ని దక్కించుకోవడానికి కొన్ని కొన్న సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
దాదాపుగా కోటి బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రం పదికోట్లు వసూలు చేస్తుందని ప్రస్తుతం ట్రేడ్ అంచనా. 'ఈరోజుల్లో'నిర్మాతల్లో ఒకరైన జి.శ్రీనివాస రావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇలా స్పందించారు. అలాగే ...2011 మార్చిలో సినిమాను స్టార్ట్ చేశాం. మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకున్నాం. షూటింగ్ పెట్టుకున్న ఏ రోజూ ప్రొడక్షన్ కాస్ట్ 22 వేలుకు దాటలేదు. ఒక్క ఎమ్మెస్ నారాయణగారి సీన్స్ చేసినప్పుడు మాత్రం ప్రొడక్షన్ కాస్ట్ 80 వేలు అయ్యిందన్నారు.
అలాగే పాత్రకు, కథకు సరిగ్గా సరిపోయింది కాబట్టే రేష్మాను కథానాయికగా ఎంచుకున్నాం. ఆ తర్వాత అందరూ ఆ అమ్మాయిని త్రిషతో పోల్చారు. అది సినిమాకు హెల్ప్ అయ్యింది. ఈ రోజు తక్కువ బడ్జెట్‌లో పెద్ద విజయాన్ని సాధించారని పరిశ్రమ పెద్దలు అంటుంటే సంతోషంగా ఉందని చెప్పారు.


Click it and Unblock the Notifications











