twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలెక్షన్స్ లో కేక పెట్టిస్తున్న బూతు బొమ్మ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో దర్శకుడి తాజా చిత్రం 'బస్‌స్టాప్‌' ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మాంఛి బూతు బొమ్మగా,ద్వంద్వార్దాలతో ఆనందపరుస్తుందని టాక్ తెచ్చుకోవటంతో కలెక్షన్స్ కు కొదవలేకపోయింది. మొదటి రోజే ఈ చిత్రం రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ కురిపిస్తూ నిర్మాత బెల్లంకొండ సురేష్ ని ఆనందపరుస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ లో బడ్జెట్ చిత్రంకు పోటీ లేకపోవటం కూడా ప్లస్ అయ్యింది.

    ఇక ఈ చిత్రం ఆదివారం కలెక్షన్స్ ని ఓ సారి పరికిస్తే... వైజాగ్ లో 11 లక్షలు,ఈస్ట్ గోదావరిలో 8 లక్షలు,గుంటూరు,నెల్లూరులో 15 లక్షలు,6 లక్షలు,నైజాంలో 44 లక్షలు సంపాదించింది. ఓవర్ సీస్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. ఇక ఈ కలెక్షన్స్ చూస్తూంటే రాబోయే రోజుల్లో ఇదే ప్లో కొనసాగితే రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. చిన్న సినిమాల్లో ఇది ఓ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

    నిర్మాత బెల్లంకొండ మరికొన్ని ప్రింట్స్ ని పెంచే పనిలో ఉన్నారు. చిత్రంకు విడుదల చేసిన ప్రోమోలు ఆసక్తి రేపటం, చిత్రం సెన్సార్ వద్ద 40 పై చిలుకు కట్స్ పడాల్సినవి పడలేదని వార్తలు రావటం,ఈ రోజుల్లో చిత్రం దర్శకుడి చిత్రం కావటం కలిసివచ్చింది. దీపావళికి స్టైయిట్ తెలుగు చిత్రాలు మరేమీ లేకపోవటం కూడా ఈ సినిమాకు మరింతగా కలిసి వస్తుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.

    ప్రిన్స్‌, శ్రీదివ్య, సాయికుమార్‌ పంపన, ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. హాసిక, గోపాల్‌సాయి, రావు రమేష్‌, శ్రీను, డి.ఎం.కె, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి. డ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాత: బి. మహేంద్రబాబు. ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, కొరియోగ్రఫీ: రఘు, సతీశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

    English summary
    Low budget film Bus Stop that released on Sunday is reaping profit. It was an unusual release as the film was screened on Sunday. With Diwali here, the film is sure to reign. Bus Stop has garnered Rs 11 Lakh in Vizag, Rs 9 Lakh in east and Rs 8 Lakh in west. Guntur and Nellore amounted to Rs 15 Lakh and Rs 6 Lakh respectively. Nizam regions has fetched Rs 44 Lakh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X