twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు,రవితేజ మధ్యనే ఈ రోజు పోటీ

    By Srikanya
    |

    చెన్నై : ఈ రోజు(శుక్రవారం,07,డిసెంబర్ 2012)మహేష్ బాబు,రవితేజ చిత్రాలు రెండూ తమిళ భాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఇద్దరు హీరోలు నటించిన హిట్ చిత్రాలు అక్కడ డబ్బింగ్ అయి విడుదల అవుతున్నాయి. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ ప్రధానపాత్రలో కనిపించిన 'బిజినెస్‌మేన్‌' అదే పేరుతోనూ, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ నటించిన 'మిరపకాయ్‌'... 'మురట్టుసింగం'గా శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.

    మహేష్‌కు తమిళనాట ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితురాలు కావడం అదనపుబలంగా నిలుస్తోంది. దీక్షాసేథ్‌, రిచా గంగోపాధ్యాయలు ప్రస్తుతం తమిళంలో రాణిస్తుండటం 'మిరపకాయ్‌'కు లాభిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. బిజినెస్‌మేన్‌ రాష్ట్రవ్యాప్తంగా 200 కేంద్రాల్లో విడుదల కానుండటం విశేషం. తెలుగులో చక్కని వసూళ్లు సాధించి ఈ సినిమాలు తమిళంలో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!

    సాధారణంగా వేసవి, దీపావళి, పొంగల్‌కు కొత్త చిత్రాలు ఎక్కువగా విడుదలవుతుంటాయి. అయితే ప్రేక్షకుల అభిరుచి మారడంతో మిగతా సందర్భాల్లోనూ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పొంగల్‌కు ముందు ఈనెలలో సుమారు డజను సినిమాలు జనాల్ని అలరించనున్నాయి. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, మాస్‌ మహరాజా రవితేజలు కూడా తమిళనాట అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వినూత్న కథనంతో తెరకెక్కిన 'కొంజం కాఫీ కొంజం కాదల్‌' కూడా శుక్రవారం విడుదల కానుంది. వెంకీ దర్శకుడు. హృథ్యరాజ్‌-ప్రియాంక జంటగా నటించారు.

    English summary
    
 Mahesh Babu’s Puri Jagannadh directed hit movie Businessman is getting dubbed into Tamil and releasing on December 7 in nearly 200 screens. Mirapakaay,2011 Telugu blockbusterFilm Starring Ravi Teja, Richa Gangopadhyay,Deeksha Seth,Prakashraj in the lead is being dubbed into Tamil as Murattu Singam. Murattu Singam film Audio composed by Thaman is getting released on Nov 26, the film is scheduled to hit screens on Dec 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X