twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్ ' తమిళ శాటిలైట్ రైట్స్ ఎంతంటే

    By Srikanya
    |

    చెన్నై : మహేష్,కాజల్ కాంబినేషన్ లో పూరి జగన్నాధ్ రూపొందించిన చిత్రం 'బిజినెస్ మ్యాన్ '. క్రితం సంవత్సరం ప్రారంభంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ రీసెంట్ గా తమిళం లో విడుదలైంది. అయితే పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రం తమిళ శాటిలైట్ రైట్స్ ఈ మధ్యనే ధర్డ్ పార్టీకి అమ్మారు. ఈ రైట్స్ నిమిత్తం నిర్మాతకు 33 లక్షలు రూపాయలు వచ్చినట్లు సమాచారం.

    ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం (శుక్రవారం,07,డిసెంబర్ 2012) న తమిళంలో విడుదలైంది. అదే రోజు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ నటించిన 'మిరపకాయ్‌'... 'మురట్టుసింగం' పోటీగా విడుదలైంది. అయితే ఈ రెండు చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించలేదు. 'బిజినెస్ మ్యాన్ ' చిత్రాన్ని మొదట సూర్యతో రీమేక్ చేస్తారనే టాక్ వచ్చింది. అయితే చాలా గ్యాప్ తీసుకుని విడుదల చేసారు. బిజినెస్‌మేన్‌ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 200 కేంద్రాల్లో విడుదల అయింది. తెలుగులో చక్కని వసూళ్లు సాధించి ఈ సినిమాలు తమిళంలో మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందని భావించి భారీగా విడుదల చేసారు.

    ప్రస్తుతం మహేష్ ..సీతమ్మ వాకిట్లో చిత్రం హడావిడిలో ఉన్నారు. వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతుున్న ఈ చిత్రం ప్రీమియర్ షో లను రాష్ట్ర మొత్తం జనవరి 10 రాత్రి వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు కేవలం హైదరాబాద్ లో మాత్రమే అదీ కేవలం సినిమా వాళ్లకు,తమ శ్రేయాభిలాషులకు స్పెషల్ గా ఈ ప్రీమియర్ షోలు రిలీజ్ కు ముందు రోజు రాత్రి వేసేవారు. అయితే మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్టేట్ వైడ్ గా వేసి ఫ్యాన్స్ ని ఆనందింపచేయాలని దర్శక,నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    English summary
    
 Mahesh Babu, Kajal starrer 'Business Man' Tamil version hit the screens a fortnight back and according to latest information the satellite rights of the film were sold to a third party for Rs 33 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X