'బిజినెస్ మ్యాన్' కలెక్షన్స్ డ్రాప్!?
సంక్రాంతి కానుకగా విడుదలైన బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రెండు వేల ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయంటూ అన్ని చోట్లా వినిపిస్తోంది. అయితే దానికి కారణం వారు ధియోటర్స్ తగ్గిపోవటం చూపెడుతున్నారు. ఈస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు సెంటర్లలో విడుదల అయితే అక్కడ ఇరవై ధియోటర్స్ తీసేసి 14 ధియోటర్స్ మాత్రమే ఉంచారు.ఇలా రాష్ట్రం అంతటా ధియోటర్స్ ని తగ్గించటం జరిగింది. అయితే ఇంత మాత్రనికే కలెక్షన్స్ డ్రాప్ అనాల్సిన పని లేదని ఓ వర్గం అంటున్నారు. మొదటి రెండు వారాల్లోనే ఎక్కువ ధియేటర్స్ లో విడుదల కావటంతో చాలా మంది చూసెయ్యటం జరిగిందని, అలాంటప్పుడు ఇప్పుడు రిపీట్ ఆడియెన్స్ ఆధారపడి రన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
రిపీట్ ఆడియన్స్ కోసం మొత్తం రిలీజ్ నాటి ధియోటర్స్ అన్నీ ఉండవని తేల్చి చెప్తున్నారు. అయితే దూకుడుతో పోలిస్తే హవా తగ్గినట్లే అంటున్నారు. దూకుడు చిత్రం రోజులు గడిచేకొద్దీ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఆ రేంజి క్రేజ్ ఇప్పుడు లేదని అంటున్నారు. అయితే ఈ చిత్రం నిర్మాతలకి మొదట్లోనే టేబుల్ ప్రాఫెట్స్ తో డబ్బులు తెచ్చి పెడితే,ఆ తర్వాత వచ్చిన క్రేజ్ తో డిస్ట్రిబ్యూటర్స్, హిట్ టాక్ తో ఎగ్డిబిటర్స్ హ్యాపీగా సొమ్ము చేసుకున్నారు. అందుకే పూరీ ఉత్సాహంగా తన బిజినెస్ మ్యాన్ 2 చిత్రం కోసం స్క్రిప్టుని రెడీ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











