ప్రసాద్ మల్టిప్లెక్స్ లో మహేష్ క్రేజ్ కి షాక్
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ టిక్కెట్లు హైదరాబాద్ ప్రసాద్ మల్టిప్లెక్స్ లో అమ్మకాలు అందరినీ షాక్ చేసాయి. అడ్వాన్స్ కౌంటర్ స్టార్టైన ఒక్క గంటలోనే మొత్తం అమ్ముడయ్యాయి. ఓపినింగ్ రోజున ముప్పై మూడు షోలు వేస్తున్నారు. అన్నీ బుక్ అయ్యి..ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ చిత్రం 16 వందల థియేటర్లలో విడుదలవుతోంది. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా నైజాంలో రెండు వందల యాభై ప్రింట్లు వేస్తున్నారు. అందులో హైదరాబాద్ లోనే తొంభై ధియోటర్లలో విడుదల అవుతోంది. ఇక బెనిఫిట్ షోలే హైదరాబాద్ లో 28 చోట్ల వేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ స్పెషల్ ఎట్రాక్షన్.మహేష్ సినిమా అంటే మినిమం ఓ వారం పాటు టిక్కెట్లు దొరకని పరిస్ధితి ఉంటుందని,ధియోటర్స్ మొత్తం పండుగ వాతావరణంతో కళకళ్లాడతాయని,నిజానికి ధియోటర్లకు సంక్రాంతి కళ వస్తుందని చెప్తున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం విడుదల కోసం చాలా చోట్ల ధియోటర్స్ లోని సౌండ్ సిస్టమ్ వంటివి బాగు చేయిస్తున్నారు.
ఆ రోజున ఓ రేంజిలో తమ ధియోటర్స్ ని అలంకరించి బిజినెస్ మ్యాన్ ద్వారా వచ్చే బిజినెస్ కి ఆహ్వానం పలుకటానికి రెడీ అవుతున్నారు. పూరీ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భాయ్ కావాలనుకున్నోడి కథ ఇది. 'పోకిరి' చిత్రానికి ఈ చిత్రానికి మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందులో కొత్త మహేష్ కనిపిస్తాడు. ఆ చిత్రం తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రం వుంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











