సి.కళ్యాణ్ మళ్లీ రంగంలోకి ...
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో కలిసి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిర్మాత సి.కళ్యాణ్ తిరిగి మళ్లీ తన సినీ ప్రస్దానం ప్రారంభించారు. ఆయన తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత,నాని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రైట్స్ ని తీసుకున్నారు. ప్రేమికుల రోజున విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ను ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో తీసుకున్నారు. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రం ఇప్పుటకి దాదాపు అరవై శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఆయన చివరగా ఖలేజా,కొమురం పులి,పరమవీరచక్ర,రక్త చరిత్ర 2 చిత్రాలు నిర్మించారు. శింగనమల రమేష్ అరెస్టు ఆ తర్వాత ఓ అగ్ర దర్శకుడి నుంచి ఏడు కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా కళ్యాణ్ బెదిరిస్తూ వచ్చాడనే ఆరోపణలు, భాను కిరణ్ తో లింకులు తో ఆయన్ని సిఐడి పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
అలాగే శింగనమల రమేష్ అరెస్టు తర్వాత కళ్యాణ్‌పైన సిఐడి పోలీసులు దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక భాను కిరణ్‌తో సంబంధాలపై కళ్యాణ్‌పైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు మీడియా హడావిడి చేసింది. భాను కిరణ్ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో సొమ్ము చేరుతోందని, ఇది తెలుగు సినీ పరిశ్రమ నుంచి జమ అవుతున్న సొమ్మేనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. గత ఆరు నెలలుగా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్న భాను కిరణ్ సినీ పరిశ్రమతో ఇప్పటికీ సంబంధాలన కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు అని రాసుకొచ్చారు. అవన్నీ ప్రక్కన పెడితే ఈ చిత్రం ప్రేష్ లవ్ స్టోరీ అని, ఏమి మాయ చేసావే తరహాలో మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమాలో మొదట రామ్ అనుకుని కొంత షూటింగ్ చేసిన తర్వాత డేట్స్ ఎడ్జెస్ట్ కాక నానిని సీన్ లోకి తీసుకు వచ్చారు.


Click it and Unblock the Notifications











