హాట్ టాపిక్ :ధన 'పిశాచి' అంటున్నారు

By Srikanya

హైదరాబాద్ : నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, హరీష్‌ ఉత్తమన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన అనువాద చిత్రం 'పిశాచి'. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌, కోనేరు కల్పన నిర్మాతలు. వచ్చే నెల మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. క్రిందటి నెలలో హన్సిక ప్రధాన పాత్రలో నటించిన చంద్రకళ అనే హర్రర్ చిత్రాన్ని విడుదల చేసి హిట్ కొట్టిన సి కళ్యాణ్ ఈ చిత్రం విజయం పైనా నమ్మకంగా ఉన్నారు. ఈ పిశాచి...సి కళ్యాణ్ కి ధన పిశాచిగా మారుతుందని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మనసుల్ని దోచుకొనే దెయ్యం కథతో రూపొందిన చిత్రమిది. తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అన్నారు.

C.Kalyan's 'Pisachi' in Feb first week

‘చంద్రకళ' సినిమా తరువాత మరో తమిళ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సి.కళ్యాణ్‌. మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి' సినిమాను సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సి.కల్యాన్‌, కల్పన అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాల ఈ చిత్రానికి సమర్పకులు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలై పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే ఓ దెయ్యం కథ ఇది. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా అంతా కొత్తవారితో ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్‌ హారర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉంది. పెద్ద పోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ దక్కించుకున్నాను. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.'' అని తెలిపారు.

ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవిరాయ్‌, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X