'మహేష్ ఖలేజా' విషయమై నిర్మాత సి.కళ్యాణ్ వార్నింగ్
మహేష్ తాజా చిత్రం ఖలేజా ఓవర్ సీస్ రైట్స్ ని ఫికస్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారనే సంగితి తెలిసిందే. అయితే తాజాగా వీరికి చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ వార్నింగ్ ఇఛ్చారని సమాచారం. రెండు రోజుల్లో ఖలేజా రైట్స్ కి చెందిన డబ్బుని పూర్తిగా చెల్లించమని ఆయన హెచ్చరించారు. అలాగే డబ్బు క్లియర్ కాకపోతే మరొక కంపినీకు రైట్స్ ని ఇచ్చేస్తామని మొహమాటం లేకుండా చెప్పారు. అలాగే కాన్సిలేషన్ విషయాన్ని ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి మరీ చేస్తానన్నారు. ఇంతలా కళ్యాణ్ అనటానికి కారణంగా కొమురం పులి చిత్రం విషయంలో వారు ఇష్యూ చేసిన చెక్కులు చెల్లక, సినిమా ఫెయిల్యూర్ టాక్ వచ్చి, డబ్బు తగ్గించి సెటిల్ మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి సంఘటన మళ్ళి పునరావృతం కాకుండా సి.కళ్యాణ్ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఇక ఈ ఎగ్రిమెంట్ అయ్యేటప్పటికి సి.కళ్యాణ్ సీన్ లో లేరు. కేవలం నిర్మాతగా సింగనమల రమేష్ మాత్రమే ఉన్నారు. ఇక ఫికస్ మూవీస్ వారు ఈరోజు..రోబో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











