‘రాంబాబు’ కలెక్షన్స్ డ్రాప్....(వరల్డ్ వైడ్ రిపోర్ట్)
హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం అంచనాలకు తగిన విధంగానే తొలి రోజు భారీ కలెక్షన్స్ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.
అయితే సినిమాపై తెలంగాణ వివాదం నెలకొనడంతో రెండో రోజు నైజాం ఏరియాలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. రెండు రోజుల్లో ఈచిత్రం ఈచిత్రం దాదాపుగా రూ. 27.25 కోట్లు వసూలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ గత చిత్రం గబ్బర్ సింగ్ చిత్రం తొలి, రెండో రోజు రికార్డులను ఈచిత్రం బద్దలు కొట్టినట్లయింది.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈచిత్రాన్ని బారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటించారు. హీరోయిన్ తమన్నా కెమెరామెన్ పాత్ర పోషించింది. ఈ చిత్రానికి సంగీతం: మణి శర్మ.
కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఏరియా తొలి రోజు రెండో రోజు
నైజాం రూ. 3.22 కోట్లు రూ. 2.5 కోట్లు
సీడెడ్ రూ. 1.75 కోట్లు రూ. 1.35 కోట్లు
వైజాగ్ రూ. 0.70 కోట్లు రూ. 0.58 కోట్లు
ఈస్ట్ రూ. 0.75 కోట్లు రూ. 0.65 కోట్లు
వెస్ట్ రూ. 0.75 కోట్లు రూ. 0.66 కోట్లు
కృష్ణా రూ. 0.70 కోట్లు రూ. 0.35 కోట్లు
గుంటూరు రూ. 1.30 కోట్లు రూ. 1.35 కోట్లు
నెల్లూరు రూ. 0.45 కోట్లు రూ. 0.39 కోట్లు
రెస్టాఫ్ ఇండియా రూ. 2.75 కోట్లు రూ. 3 కోట్లు
ఓవర్సీస్ రూ. 1.25 కోట్లు రూ. 1.40 కోట్లు
మొత్తం(వలర్డ్ వైడ్) రూ. 14.37 కోట్లు రూ. 12.88 కోట్లు


Click it and Unblock the Notifications











