‘రాంబాబు’ఫస్ట్ వీక్ కలెక్షన్స్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ 'గబ్బర్ సింగ్' రికార్డులను సైతం బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఈ కలెక్షన్స్ ప్రచురించింది. అవి..
ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (షేర్)
నైజాం.... 7.6 కోట్లు
గుంటూరు...2.37 కోట్లు కృష్ణా...1.52 కోట్లు
ఈస్ట్,వెస్ట్ గోదావరి....3 కోట్లు
నెల్లూరు,సీడెడ్, కర్ణాట, ఇండియాలో మిగతా ప్రదేశాల్లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోందని చెప్తున్నారు.
తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 14.37 కోట్లు సాధించింది. అయితే సెకండ్ రోజు ఈచిత్రంపై తెలంగాణ ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు జరుగడంతో కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. అయితే తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఈచిత్రంలో వివాదాస్పద డైలాగులు, సీన్లను తొలగించడంతో మళ్లీ ప్రదర్శన మొదలైంది. ఆ ఆందోళన కార్యక్రమాలే సినిమాకు ప్లస్సయ్యాయా....అన్నట్లు సినిమా పుంజుకుని కలెక్షన్లు భారీగా కురిపిస్తోందని వినికిడి.
ఇక 'గబ్బర్ సింగ్' తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ గా రూ. 42 కోట్లు వసూలు చేస్తే....'రాంబాబు' మూవీ ఆ రికార్డును బద్దలు కొట్టి రూ. 54.19 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ రేంజిలో కలెక్షన్లు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించలేదని చెప్తున్నారు. అయితే నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ ప్రకటిస్తే కానీ నిజా నిజాలు తెలియవు.


Click it and Unblock the Notifications











