పవన్ సినిమాకు...మంచు విష్ణు ఎఫెక్ట్!

దాదాపు 1600 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసును భారీ ఓపెనింగ్స్ తో షేక్ చేసింది. సెకండ్ వీక్ లోనూ పవన్ సినిమా మేనియా కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఇప్పటి వరకు రూ. 42.23 కోట్ల నెట్ అమౌంట్ వచ్చినట్లు అంచనా.
పవన్ కళ్యాణ్ గత సినిమా 'గబ్బర్ సింగ్' విడుదలైన 10 రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసింది. కానీ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయింది. గబ్బర్ సింగ్ సినిమాను మించి ఆడుతుందనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. దీనికి 'దేనికైనా రెడీ' చిత్రం కూడా ఓ కారణం అంటున్నారు.
మంచు విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రం అక్టోబర్ 24న వరల్డ్ వైడ్ గా 600 ప్రింట్లతో విడుదలైంది. ఈ చిత్రం వరల్ వైడ్ గా తొలి 5 రోజుల్లో దాదాపు రూ. 18 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ రావడమే ఇందుకు కారణం.


Click it and Unblock the Notifications











