Cameraman Gangatho Rambabu Collections.. పవన్ కల్యాణ్ మూవీ రీ రిలీజ్‌కు సూపర్ రెస్పాన్స్.. కలెక్షన్లు ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తమన్నా భాటియా, ప్రకాశ్ రాజ్, కోటా శ్రీనివాసరావు నటించిన చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. ప్రముఖ నిర్మాతలు డీవీవీ దానయ్య, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 7, 8, 9వ తేదీల్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాలకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రికార్డు కలెక్షన్లు కూడా నమోదు అయ్యాయి. అయితే తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రిలీజ్‌కు సిద్దం చేశారు.

ఏపీ రాజకీయాలు, రాజకీయ నేతల అవినీతి, ముఖ్యమంత్రి అరాచకాలను ప్రశ్నించే జర్నలిస్టు రాంబాబు కథా నేపథ్యంతో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రూపొందింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కడం, త్వరలోనే ఎన్నికలు జరుగనుండటంతో ఈ సినిమా ప్రస్తుతం యాప్ట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు డిస్టిబ్యూటర్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో కెమెరామెన్ రాంబాబు సినిమాకు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాను సుదర్శన్ 35 ఎంఎంలో 5 షోలు, దేవీలో 1 షో, సంధ్య 70 ఎంఎంలో 1 షో, సంధ్య 35ఎంఎం 5 షోలు, శాంతిలో రెండు షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. దాదాపు అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సంధ్య 35 థియేటర్‌లో 1.45 లక్షలు, సంధ్య 70 ఎంఎంలో 1.85 లక్షలు, సుదర్శన్ థియేటర్‌లో 1.7 లక్షలు, శాంతీలో 1.5 లక్షలు, దేవీలో 1.8 లక్షల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 22 లక్షలు వసూలు చేసింది.
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో అర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్, శాటిలైట్, ఇతర బిజినెస్‌తో కలిపి ఈ సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











