జనతా గ్యారేజ్ రికార్డులకు జై లవకుశ చెక్.. కలెక్షన్ల వర్షమేనట..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవకుశ. ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవకుశ. ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని మించి జై లవకుశ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే...

దసరా కానుక...
జై లవకువ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాకుండా దసరా పండుగ కానుకగా రిలీజైంది. నవరాత్రులు, తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలోనే ఈ చిత్రం విడుదలకానుంది. పండుగ సీజన్‌లో ఈ చిత్రం అతి భారీ విజయం నమోదు చేసుకుంటుందనే విషయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో నటించిన చిత్రాల రికార్డులను... జైలవకుశ చిత్రం తుడిచి చేస్తుందని వారంత ధీమాగా ఉన్నారు. జై లవకువ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే లక్షలాది మంది అభిమానులు వీక్షించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

రూ. 100 కోట్ల క్లబ్....
అయితే గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన జనతా గ్యారేజ్ విడుదలైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

2016లో మూడో స్థానంలో...
జనతా గ్యారేజీ చిత్రం 100వ రోజు నాటికి కలెక్షన్ల పరంగా ఆంధ్ర రాష్ట్రంలో రూ. 134.8 కోట్లు వసూలు చేస్తే... తెలంగాణలో రూ. 93 కోట్లు వసూలు చేసింది. అలాగే కేరళలో రూ. 4.40 కోట్లు వసూల్ చేసింది. 2016 ఏడాదిలో విడుదలై హిట్ చిత్రాల జాబితాలో జనతా గ్యారేజ్ మూడో స్థానంలో నిలిచింది.

2400 స్కీన్లలో
జై లవకుశ సెప్టెంబర్ 21న హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటించారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ వ్యవహరించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలోనూ, కేవలం హైదరాబాద్‌లోనే 100 స్క్రీన్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ వసూళ్లను అధిగమించే అవకాశం ఉందనే మాట వినిపస్తున్నది. ఎందుకంటే ఈ చిత్రానికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











