ధురంధర్ 2 రికార్డులకు ముప్పు.. బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న తెలుగు సినిమాలివే!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ విజయం అందుకున్న సినిమాల్లో 'ధురంధర్ 2'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఒకప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ అంటేనే అసాధ్యంగా భావించిన రోజులు పోయాయి. ఇప్పుడు రూ.1500 కోట్లు, రూ.1800 కోట్లు కూడా సాధ్యమేనని ఇండియన్ సినిమా నిరూపిస్తోంది. అయితే ధురంధర్ 2 నెలకొల్పిన ఈ భారీ రికార్డులను భవిష్యత్తులో ఏ సినిమాలు బద్దలు కొట్టగలవనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు.. ధురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాయనే సత్తా ఆ సినిమాలకు ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటీ?

ధురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమాల్లో మొదటిగా వినిపిస్తున్న పేరు రాజమౌళి 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, భారతీయ పురాణాలు, ప్రపంచవ్యాప్తంగా సాగే కథనం, భారీ విజువల్స్, హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలు ఈ సినిమాను గ్లోబల్ ఈవెంట్‌గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సరైన కంటెంట్ ఉంటే వారణాసి రూ.2000 కోట్ల క్లబ్‌ను టచ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Can Varanasi Raaka Kalki 2 and Spirit Break Dhurandhar 2 s Massive Box Office Record

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'రాకా'. ఈ సినిమా కూడా రికార్డుల వేటలో ముందంజలో ఉంది. 'పుష్ప 2' తర్వాత బన్నీకి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మరోవైపు కమర్షియల్ మాస్ సినిమాలను భారీ స్థాయిలో ప్రజలకు చేరవేయడంలో అట్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినిమాలో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని జానర్ కావడం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, పాన్ వరల్డ్ కాన్సెప్ట్ కలిసి వస్తే 'రాకా' కూడా ధురంధర్ 2 రికార్డులకు గట్టి సవాల్ విసరగలదని భావిస్తున్నారు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి పార్ట్ 2'. ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి పార్ట్ 1 రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కథలో ఇంకా మిగిలిన కీలక అంశాలు, ప్రభాస్ పాత్ర పరిణామం, కమల్ హాసన్ విలన్ ట్రాక్ వంటి అంశాలు సినిమాపై హైప్‌ను పెంచుతున్నాయి. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత గ్రాండ్‌గా ఉంటుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. దీంతో 'కల్కి 2' కూడా 2000 కోట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.

మరోవైపు ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న 'స్పిరిట్'పై కూడా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్లతో హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్స్ అందించిన సందీప్ రెడ్డి, ఇప్పుడు ప్రభాస్‌ను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ హైప్ ఏర్పడింది. సందీప్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచాయి. "బాహుబలి రికార్డులను దాటాలంటే 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి" అని ఆయన చెప్పడంతో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. సరైన కంటెంట్, ప్రభాస్ స్టార్ పవర్, సందీప్ టేకింగ్ కలిసి వస్తే ఈ సినిమా కూడా ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు.

అయితే ధురంధర్ 2 రికార్డులను బద్దలు కొట్టడం అంత సులభం కాదు. ఆ సినిమాలకు పాజిటివ్ మౌత్ టాక్, రిపీట్ ఆడియన్స్, స్ట్రాంగ్ ఓవర్సీస్ మార్కెట్, పాన్ ఇండియా అప్పీల్ వంటి అనేక అంశాలు కలిసి వచ్చాయి. కేవలం స్టార్ పవర్ ఉంటే సరిపోదు. కంటెంట్, ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కూడా కీలక పాత్ర పోషించాలి. అయినప్పటికీ 'వారణాసి', 'రాకా', 'కల్కి పార్ట్ 2', 'స్పిరిట్' వంటి తెలుగు సినిమాలు ప్రస్తుతం ఉన్న అంచనాలను చూస్తే భవిష్యత్తులో ధురంధర్ 2 రికార్డులను సవాల్ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులుగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి భారతీయ సినిమా కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు వెయ్యి కోట్ల వసూళ్లు కలలా కనిపించగా, ఇప్పుడు రెండు వేల కోట్ల లక్ష్యంతో సినిమాలు రూపొందుతున్నాయి. రాబోయే రెండేళ్లలో తెలుగు సినిమా నుంచి వచ్చే ఈ మెగా ప్రాజెక్టులు బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తాయా? లేక ధురంధర్ 2 రికార్డులు మరికొంతకాలం చెక్కుచెదరకుండా నిలుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read more about: rajamouli prabhas Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X