Captain Miller Day 1 Collections: ధనుష్ మూవీకి కలెక్షన్ల వర్షం.. ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ సూపర్ స్టార్ ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, అదితి బాలన్, సందీప్ కిషన్ తదితరులు నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజైంది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కెప్టెన్ మిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. కెప్టెన్ మిల్లర్ అనే బ్రిటిష్ సోల్జర్ అనాలీసన్ ఈషా. బ్రిటీష్ కాలంలో జరిగే అరాచకాల నుంచి ప్రజలను రక్షించడానికి నిర్వహించిన మిషన్‌లో ఉంటాడు. అయితే కుల వివక్షకు గురైన ప్రజలకు ఎలాంటి సపోర్ట్ చేశారు. వివక్షకు ఎలాంటి ముగింపు పలకడానికి ఏం చేశాడు అనేది సినిమా కథ. ఈ మూవీకి సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

కెప్టెన్ మిల్లర్ సినిమా సుమారుగా 100 కోట్ల రూపాయలతో బ్రహ్మండంగా నిర్మించారు. ఈ సినిమాకు బజ్ హై లెవెల్‌లో ఉండటంతో తమిళంలో 1100 స్క్రీన్లలో, కర్ణాటక, కేరళలో 500 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2400 స్క్రీన్లలో విడుదల చేయడం విశేషంగా మారింది.
కెప్టెన్ మిల్లర్ సినిమాకు తొలి రోజు ఓ మాదిరి ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళంలో మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 65 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో 65 శాతం, బెంగళూరులో 40 శాతం, పాండిచ్చేరిలో 70 శాతం, దిండిగల్ 65 శాతం, త్రిచీలో 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
కెప్టెన్ మిల్లర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. తమిళంలో 7.5 కోట్ల నికర వసూళ్లు, కేరళలో 50 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1.2 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఫస్ట్ డే రోజున 10.2 కోట్ల రూపాయలు రాబట్టింది.

కెప్టెన్ మిల్లర్ సినిమా ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుందనే విషయంలోకి వెళితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 40 కోట్ల రూపాయలుగా వాల్యూ చేశారు. 42 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 42 కోట్ల షేర్, 75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











