Captain Miller Collections ధనుష్, శివరాజ్‌కుమార్ మూవీకి షాకింగ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ సూపర్ స్టార్ ధనుష్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, తెలుగు యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుల్ మోహన్, అదితి బాలన్ నటించిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కెప్టెన్ మిల్లర్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే..ఈ మూవీలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. మల్టీ స్టారర్‌గా ఈ చిత్రం రూపొందడంతో మంచి రెస్పాన్స్ క్రియేట్ అవుతున్నది. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా క్రేజీగా 70 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

తమిళంలో కెప్టెన్ మిల్లర్ సినిమాకు క్రేజ్, బజ్ ఎక్కువగా కనిపిస్తున్నది.ఈ సినిమా 2డీ, ఐమాక్సా్ 2డీ వెర్షన్లలో షూట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి 13 లక్షల టికెట్లు తమిళంలో అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రిలీజ్ చేశారు. హిందీలో 4 వేల టికెట్లు అమ్ముడుపోవడం వల్ల 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. కన్నడలో 1000 టికెట్లు తెగిపోగా 100000 రూపాయలు వసూలు చేసింది.
కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో రెస్పాన్స్ బాగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా 60000 డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 50 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్ట్ చేసింది. ఇంకా ఈ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కెప్టెన్ మిల్లర్ మూవీకి ఓ మోస్తారు స్పందన నమోదు అవుతున్నది. బుధవారం మొదలైన ముందస్తు బుకింగ్ మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ మొత్తంగా తొలి రోజు 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఇండియా వైడ్ కెప్టెన్ మిల్లర్ సినిమా గొప్పగా వసూళ్లు రాబట్టలేకపోయినా.. గౌరవ ప్రదంగా నమోదు చేశాయి. ఈ సినిమా ఇండియావైడ్ 2.25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టాయి. రిలీజ్ రోజు వరకు భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు.
ఇక కెప్టెన్ మిల్లర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ చిత్రం 8 కోట్ల షేర్, కేరళలో 55 కోట్ల షేర్, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, కర్ణాటకలో 1.2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 14.7 కోట్ల షేర్, 18 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. .
2వ రోజు కలెక్షన్లు
కెప్టెన్ మిల్లర్ సినిమా 2వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళంలో ఈ చిత్రం 6.7 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. హిందీలో ఈ సినిమా 1 కోటి రూపాయలు రాబట్టింది. కన్నడలో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 8.2 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో మొత్తంగా 17 కోట్ల రూపాయలు నమోదు చేసింది.
మూడో రోజు వసూళ్లు
ఇక మూడో రోజు కెప్టెన్ మిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించారు. ఈ సినిమా తొలి రోజు, రెండో రోజు సాధించిన కలెక్షన్ల కంటే ఈ సినిమా తక్కువగా నమోదు చేసింది. మొత్తంగా ఇండియాలో ఈ సినిమా 5.25 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇండియాలో 22 కోట్లు వసూలు చేసింది.
కెప్టెన్ మిల్లర్ మూవీ నాలుగో రోజు 6.75 కోట్లు వసూలు చేసింది. 5వ రోజు సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 15 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 35 కోట్ల షేర్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











