Captain day 1 collections తొలి రోజే ఊహించని దెబ్బ.. ఆర్య మూవీ ఎంత వసూలు చేసిందంటే?
హాలీవుడ్ స్థాయిలో టెక్నికల్‌గా తెరకెక్కించారనే వార్తల మధ్య ఆర్య నటించిన కెప్టెన్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది. ఈ సినిమా తొలి రోజు థియేట్రికల్ రన్ ఎలా ఉంది? తొలి రోజు ఎంత వసూలు చేసిందనే విషయంలోకి వెళితే..

ఆర్మీ బ్యాక్ డ్రాప్‌తో
కెప్టెన్ మూవీ ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్‌గా, సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ప్రధానంగా రూపొందింది. తమిళ హీరో ఆర్య, సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, ఆదిత్య మీనన్ తదితరులు నటించారు. అయితే కథ, కథనాల్లో స్పష్టత లేకపోవడం, స్క్రిప్టు పరంగా లోపాలు ఉండటం సినిమాకు ప్రతికూలంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్
భారీ అంచనాలు ఉండటంతో కెప్టెన్ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. అమెరికాలో 100 స్క్రీన్లు, కేరళలో 57 స్క్రీన్లు, తమిళనాడులో కోయంబత్తూరులో 70 స్క్రీన్లు, చెంగల్‌పట్‌లో 80 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 400 థియేటర్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులో 15 శాతం కంటే తక్కువ అక్యుపెన్సీ కనిపించింది.

యావరేజ్ రిపోర్టుతో
కెప్టెన్ మూవీ తమిళనాడుతోపాటు ఇతర భాషల్లో కూడా యావరేజ్ సినిమాగా రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. మొదటి రోజున పెద్దగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమా తొలి రోజే ప్రతికూల పరిస్థితులను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకొన్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
నెగిటివ్ ట్రెండ్ మధ్య కెప్టెన్ మూవీ భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. తమిళనాడుతోపాటు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 1.5 కోట్ల షేర్, 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3.5 కోట్ల గ్రాస్, 1.8 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం.

కెప్టెన్‌కు బ్రహ్మస్త్ర, ఒకే ఒక జీవితం గట్టిపోటి
తెలుగు రాష్ట్రాల్లో కూడా కెప్టెన్ అంతంత మాత్రంగానే వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడం, వినాయక నిమజ్జనం, బ్రహ్మస్త్ర సినిమా, అలాగే ఒకే ఒక జీవితం మూవీ లాంటి ఈ సినిమాకు భారీ పోటీని ఇచ్చాయి. దాంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











