Carry On Jatta 3 Collections బాక్సాఫీస్ దున్నేస్తున్న పంజాబీ మూవీ..క్యారీ ఆన్ జెట్టాకు ఎన్ని కోట్లంట్లే
పంజాబీ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సిప్పీ గ్రేవాల్ ప్రొడక్షన్స్, గుర్ఫతే ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం క్యారీ ఆన్ జట్టా. పెళ్లి బ్యాక్ డ్రాప్‌తో కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో జిప్పీ గ్రేవాల్, సోనమ్ బజ్వా జంటగా నటించారు. స్మీప్ కాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జిప్పి గ్రేవాల్, రవనీత్ గ్రేవాల్ నిర్మించారు. ఈ సినిమా కేవలం పంజాబీ భాషలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
క్యారీ ఆన్ జట్టా చిత్రం పంజాబీ భాష సినిమాల బడ్జెట్ చూసుకొంటే భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కింది. ఈ సినిమాను సుమారు 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. హీరో జిప్పీ గ్రేవాల్ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 650 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ భారీగా పెరగడంతో భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది.

క్యారీ ఆన్ జట్టా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా 5.2 కోట్ల కలెక్షన్లను, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 4.5 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశంలో 5 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 10కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇక నాలుగో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. గత మూడు రోజుల్లో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. నాలుగో రోజు కూడా అదే జోష్‌ను సొంతం చేసుకొన్నది. మార్నింగ్ షోకు 33 శాతం, మధ్యాహ్నం 70 శాతం, ఫస్ట్ షోకు 80 శాతం, సెకండ్ షోకు 80 శాతానికి పైగా వసూళ్లను సాధించింది.

ఇక క్యారీ ఆన్ జట్టా సినిమా నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆదివారం భారీ కలెక్షన్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
క్యార్ ఆన్ జట్టా సినిమా గత నాలుగు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రికార్డు వసూళ్లను సాధించింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 42 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. అమెరికా, కెనడాలో సుమారు 7 కోట్ల రూపాయలు, పాకిస్థాన్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











