2 Years For iSmart Shankar: పూరి జగన్నాథ్ - రామ్‌ను కాపాడిన మాస్ సినిమా.. క్లోజింగ్ కలెక్షన్స్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు వరుస బాక్సాఫీస్ హిట్స్ తో ట్రెండ్ సెట్ సివేసినవారే. అయితే ఆయన కెరీర్ డౌన్ లో ఉన్న సమయంలో మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా మాత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి నేటితో రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పోస్టర్స్ ను షేర్ చేసుకుంటున్నారు. ఇక సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

రామ్ ఒక్కడే నమ్మాడు
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసగా అపజయాలు అందుకుంటున్న క్రమంలో ఏ స్టార్ హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఇక ఆ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ కథను కొంతమంది హీరోలకు చెప్పగా నచ్చలేదని బిజీగా ఉన్నామని చెప్పి తప్పించుకున్నారు. అలాంటి సమయంలో రామ్ ఒక్కడే పూరి జగన్నాథ్ ను నమ్మాడు.

చాలామంది కంగారుపడ్డారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ మొదటి సారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించాడు. లవర్ బాయ్ తరహాలో క్యూట్ గా ఉండే రామ్ ఆ స్థాయిలో మెప్పించగలడా అని ముందు చాలామంది కంగారుపడ్డారు. కానీ రామ్ పూరి జగన్నాథ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. సినిమా ట్రైలర్ సాంగ్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక నాభా నటేష్, నిధి అగర్వాల్ యాక్టింగ్ అండ్ గ్లామర్ కూడా సినిమాకు బాగానే హెల్ప్ అయ్యింది.

కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్
పోకిరి అనంతరం పూరి జగన్నాథ్ సినిమాకు వర్క్ చేసిన మణిశర్మ అదిరిపోయేలా సాంగ్స్ ఇచ్చాడు. ఇక సినిమాలో ప్రతి సాంగ్ కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక 2018 జూలై 18న గ్రాండ్ గా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ను అందుకుంది. సినిమాను దర్శకుడు పూరి, ఛార్మితో కలిసి సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించాడు.

క్లోజింగ్ కలెక్షన్స్..
ఇక సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. రామ్ పోతినేని కెరీర్ లో అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఇస్మార్ట్ శంకర్ రికార్డును అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా
రూ. 34.55కోట్ల షేర్ ను అందించింది. నాన్ థియేట్రికల్ గా కూడా మంచి డీల్స్ సెట్టవ్వడంతో పూరి జగన్నాథ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఇక ఆ హిట్టుతో పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











