For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామేన్ గంగతో..' ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్బ్

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించిన చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ రోజు నుంచి రికార్డులుతో బిజినెస్ మొదలవుతుంది. అయితే ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ కూడా ఓ రేంజిలో జరిగి ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    ట్రేడ్ లో చెప్పుకునే దాన్ని బట్టి ఏరియాల వారిగా....

    నైజాం ----: 11.5Cr దిల్ రాజు

    సీడెడ్ ----: 7.5Cr శోభు

    నెల్లూరూ----- : 1.8Cr గాయిత్రి ఫిల్మ్స్

    గుంటూరు---: 3Cr తులసి ఫిల్మ్స్

    ఈస్ట్ గోదావరి -------:2.7 Cr అనుశ్రీ ఫిల్మ్స్

    వెస్ట్ గోదావరి ------ 2.3Cr బన్ని వాసు

    మిగిలిన ఇండియా-------2.5Cr రెడ్ జెయింట్ ఫిల్మ్స్

    గల్ఫ్,యుకె. తో కలిపి ఓవర్ సీస్ ....4.5 Cr లీ

    మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ - 42.4 crore

    ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.

    తాను పవన్ కళ్యాణ్ సినిమాకు అమెరికాలో వస్తున్న ఈ క్రేజ్ కు చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాని భాక్సాఫీస్ వ్దద మరోసారి పునర్ నిర్వచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్ తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు. గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.

    పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Power Star Pawan Kalyan’s highly anticipated movie, ‘cameraman gangatho rambabu’ is all set to release on 18th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X