Chaari 111 Collections వెన్నెల కిషోర్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. చారి 111 మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్, యువ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ జంటగా నటించిన చిత్రం కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ చారీ 111. యువ దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అదితి సోని నిర్మించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు మంచి స్పందన కనిపించింది. దాంతో ఈ సినిమాను మార్చి 1వ తేదీన గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన చారి 111 మూవీలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, తాగుబోతు రమేష్, సత్య నటించారు. దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలో నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 2 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు.

చారి 111 సినిమా ప్రమోషన్స్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. వెన్నెల కిషోర్ హీరోగా నటించడంతో మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 200 స్క్రీన్లు, ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
చారి 111 మూవీ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. వెన్నెల కిషోర్ కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా ఆక్యుపెన్సీ మధ్యాహ్నం ఆటల తర్వాత పెరిగింది. మల్టీ ప్లెక్స్‌లో మంచి రెస్సాన్ రాగా, బీసీ సెంటరల్లో ఓ మోస్తారు స్పందన కనిపిస్తున్నది.

ఇక వెన్నెల కిషోర్ కెరీర్‌లో బెస్ట్ సినిమాగా క్రిటిక్స్ పేర్కొంటున్నారు. హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి రెంజ్‌లోనే కలెక్షన్లు నమోదు అయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ మూవీ తొలి రోజు 50 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











