Chaavu kaburu challaga 3rd day collections.. బాక్సాఫీస్ వద్ద తడబాటు.. లాభాల్లోకి రావాలంటే!
RX 100 ఫేమ్ కార్తీకేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చావు కబురు చల్లగా చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. అయితే ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. ఈ క్రమంలో ఈ చిత్రం మూడో రోజున ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే...
ఈవెంట్లో సీఎం సీఎం అంటూ ఫాన్స్ కేకలు: ఎన్టీఆర్ సీరియస్ (ఫొటోలు)

3వ రోజు కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో చావు కబురు చల్లగా సినిమా 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 28 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 13 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో రూ.7 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.3 లక్షలు, గుంటూరులో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5.7 లక్షలు, నెల్లూరులో రూ.3.1 లక్షల కలెక్షన్లను రాబట్టింది.

సెలవు రోజున ఆశాజనకంగా
చావు కబురు చల్లగా వారాంతంలో ఓ మోస్తారు కలెక్షన్లతో ముందుకెళ్తున్నది. అయితే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకొంటే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానం కలుగుతున్నది. 3వ రోజున అంటే ఆదివారం సెలవు రోజున ఏపీ, నైజాంలో 71 లక్షల నికర వసూళ్లు, 1.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
నితిన్ నా తమ్ముడు లాంటి వాడు..త్రివిక్రమ్ భావోద్వేగం..రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ (గ్యాలరీ)

మూడు రోజుల మొత్తం కలెక్షన్లు
చావు కబురు చల్లగా సినిమా మూడు రోజుల మొత్తం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.07 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 49 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో రూ.31 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.20 లక్షలు, గుంటూరులో రూ.20 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.22 లక్షలు, నెల్లూరులో రూ.12 లక్షల కలెక్షన్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
గత మూడు రోజుల్లో ఏపీ, నైజాంలో కలిపి రూ.2.73 కోట్ల నికర వసూళ్లను, రూ.4.42 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.8 లక్షలు, ఓవర్సీస్‌లో 12 లక్షలలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.2.93 కోట్ల నికర వసూళ్లను, రూ.4.80 గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
Photos: Aranya Pre Release Event

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 13 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. అయితే ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 13.5 కోట్లు వసూలు చేయాల్సి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లను చూస్తే ఈ లక్ష్యంగా కష్టంగానే కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











