Chaavu Kaburu Challaga Day 1 Collections: తొలిరోజు కార్తికేయ హవా.. రికార్డు క్రియేట్ చేసిన మూవీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే మంచి నటనతో గుర్తింపును అందుకుంటున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ. 'RX100' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడతను. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కార్తికేయ 'చావు కబురు చల్లగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు అందుకుందో చూడండి!

చావు కబురు చల్లగా చెప్పేందుకు వచ్చాడు

చావు కబురు చల్లగా చెప్పేందుకు వచ్చాడు

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ - సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించాడు. ఆమని కీలక పాత్రను పోషించగా, హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు.

 వాటి వల్ల అంచనాలు... అదే రీతిలో బిజినెస్

వాటి వల్ల అంచనాలు... అదే రీతిలో బిజినెస్

పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కారణంగా 'చావు కబురు చల్లగా' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అయిదు ఆరు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్‌‌తో రూపొందిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా రూ. 13 కోట్ల రూపాయలను చేసింది. అదే సమయంలో కార్తికేయ కెరీర్‌లోనే భారీ స్థాయిలో విడుదలైంది.

 షాకిచ్చిన మూవీ టాక్.. రివ్యూలు కూడా అలా

షాకిచ్చిన మూవీ టాక్.. రివ్యూలు కూడా అలా

'చావు కబురు చల్లగా' మూవీకి ప్రీమియర్ షోల నుంచే కొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను ఎంత మంది బాగుందని అన్నారో.. అంతే మంది బాలేదని చెప్పారు. దీంతో ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దాదాపు అన్ని సంస్థలూ రివ్యూలు కూడా ఓ మోస్తరుగానే ఇచ్చాయి. అయితే, శుక్రవారం వచ్చిన సినిమాల్లో మాత్రం ఇదే బాగుందన్న టాక్ వినిపిస్తోంది.

మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చాయి. తద్వారా నైజాంలో రూ. 61 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 12 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.58 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించిన 'చావు కబురు చల్లగా' రూ. 1.58 కోట్లు వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 లక్షలు రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 1.67 కోట్లు షేర్, రూ. 2.68 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో కార్తికేయ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'చావు కబురు చల్లగా' మూవీ బిజినెస్ రూ. 13 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు ఇది రూ. 1.67 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 11.83 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X