Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'చావు కబురు చల్లగా' టార్గెట్.. బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయాలంటే?
లాక్ డౌన్ తరువాత సినిమాల పరిస్థితి అనుమానమే అంటూ కామెంట్ చేసిన వాళ్ళ ఆలోచనకు తెలుగు ఆడియెన్స్ ఇచ్చిన సమాధానం మామూలుగా లేదు. డిఫరెంట్ సినిమాలు తీసామంటే సరిపోదు. కంటెంట్ ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటేనే సినిమాలు చూస్తామని జనాలు నిరూపించారు. ఇక ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమా కూడా అదే తరహాలో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద టార్గెట్ తోనే రంగంలోకి దిగుతోంది.
హ్యాట్రిక్ విజయాలు
జనవరిలో మొదలైన హవా మార్చి వరకు గట్టిగానే కొనసాగింది. మొదట క్రాక్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 50కోట్ల వసూళ్లను అందుకొని మంచి లాభాలను ఇవ్వగా ఇక ఆ తరువాత ఫిబ్రవరిలో ఉప్పెన 100కోట్ల కలెక్షన్స్ తో మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మార్చిలో జాతిరత్నాలు డామినేట్ చేస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నెలకొక బాక్సాఫీస్ హిట్ అందుకుంటోంది.
డిఫరెంట్ కంటెంట్ తో..
ఇక మార్చ్ 19న విడుదలవుతున్న చావు కబురు చల్లగా కాస్త డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కడంతో సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఎదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. హీరో ఒక శవాల వ్యాన్ ను నడిపే వ్యక్తిగా నటిస్తుండగా లావణ్య భర్త చనిపోయిన యువతిగా కనిపించనుంది.
డీసెంట్ టార్గెట్
ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. యూత్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా టార్గెట్ చేస్తూ షాపింగ్ మాల్స్ లలో ప్రమోషన్ చేస్తోంది. సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు నిర్మాతలు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే సాగింది. ఆ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్..
చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 13.05కోట్లు. ఇక సినిమా హిట్టవ్వాలి అంటే బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 13.50కోట్ల వసూళ్లను రాబట్టాలి. రిలీజ్ కాకముందే సినిమాపై కొంత పాజిటివ్ టాక్ అయితే నడుస్తోంది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద క్లిక్కయ్యేలా ఉన్నట్లు చిత్ర యూనిట్ బాగానే ప్రమోషన్ చేస్తున్నారు. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.