Chaavu Kaburu Challaga Total Collections: రిలీజ్‌కు ముందు పాజిటివ్ బజ్.. తీరా చూస్తే చెత్త రికార్డు

'RX100' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ. మొదటి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన అతడు.. నటుడిగానూ మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత కూడా విభిన్నమైన చిత్రాలు చేస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన బ్రేక్ కోసం 'చావు కబురు చల్లగా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ నిరాశనే ఎదుర్కొంది. ఇక, ఈ కార్తికేయ మూవీ ముగింపు కలెక్షన్ల రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

చావు కబురు చల్లగా చెప్పేందుకు వచ్చాడు

చావు కబురు చల్లగా చెప్పేందుకు వచ్చాడు

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ - సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించాడు. ఆమని కీలక పాత్రను పోషించగా, హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు.

భారీగా అంచనాలు.. బిజినెస్ కూడా అలాగే

భారీగా అంచనాలు.. బిజినెస్ కూడా అలాగే

పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కారణంగా 'చావు కబురు చల్లగా' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అయిదు ఆరు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్‌‌తో రూపొందిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా రూ. 13 కోట్ల రూపాయలను చేసింది. అదే సమయంలో కార్తికేయ కెరీర్‌లోనే భారీ స్థాయిలో విడుదలైంది.

ఏపీ, టీఎస్‌లో ఎంత? వసూలు చేసిందంటే?

ఏపీ, టీఎస్‌లో ఎంత? వసూలు చేసిందంటే?

మొదటి రోజు నుంచే 'చావు కబురు చల్లగా'కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్‌లో రూ. 23 లక్షలు, వెస్ట్‌లో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.08 కోట్లు షేర్, రూ. 5.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతగా రాబట్టలేకపోయిన 'చావు కబురు చల్లగా'.. మిగిలిన ఏరియాల్లోనూ నిరాశగా సాగింది. ముగింపు సమయానికి రెండు రాష్ట్రాల్లో రూ. 3.08 కోట్లు వసూలు చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 3.32 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిందెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా 'చావు కబురు చల్లగా' మూవీ బిజినెస్ రూ. 13 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.32 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా రూ. 10.18 కోట్ల నష్టాలను మిగుల్చుకుంది. దీంతో కార్తికేయ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది.

చరిత్రలోనే మొట్టమొదటి డిజాస్టర్.. చెత్త రికార్డు

చరిత్రలోనే మొట్టమొదటి డిజాస్టర్.. చెత్త రికార్డు

'చావు కబురు చల్లగా' మూవీ GA2 పిక్చర్ బ్యానర్‌పై రూపొందిన విషయం తెలిసిందే. ఇది భారీ నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యానర్‌లో మొదటి ఫ్లాప్ మూవీగా నిలిచింది. గతంలో బన్నీ నిర్మాణంలో 'భలే భలే మగాడివోయ్', 'గోత గోవిదం', 'టాక్సీవాలా', 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాలు విడుదలవగా.. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇదొక్కటే ఫ్లాప్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X