Chandramukhi 2 box office Report 50 కోట్లకు చేరుగా చంద్రముఖి 2.. 5వ రోజు కూడా రికార్డు కలెక్షన్లుతో

ప్రముఖ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో కంగన రనౌత్, లారెన్స్ రాఘవ, మహిమా నంబియార్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం చంద్రముఖి2. 17 ఏళ్ల క్రితం సంచలన విజయం అందుకొన్న చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లను అందుకొన్నదనే విషయంలోకి వెళితే..

చంద్రముఖి 2 చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగడంతో తొలి రోజు కలెక్షన్లు భారీగానే నమోదు అయ్యాయి. ఈ చిత్రం తొలి రోజున 12.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా అందుకొన్నది. ఇక రెండో రోజు విషయానికి వస్తే..ఈ చిత్రం 8 కోట్ల గ్రాస్ వసూళ్లను, మూడో రోజు 7.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ సానుకూలంగా మారింది.

 Chandramukhi 2 box office Report 50

చంద్రముఖి 2 చిత్రం 4వ రోజు కలెక్షన్లు భారీగానే నమోదు అయ్యాయి. తమిళనాడులో 5.7 కోట్ల రూపాయలు, ఆంధ్రాలొ 1.3 కోట్ల గ్రాస్ వసూళ్లు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, కేరళలో 15 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 60 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

 Chandramukhi 2 box office Report 50

చంద్రముఖి 2 సినిమా గత 4 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 19 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 6.7 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 1.2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 4.15 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 35 కోట్ల రూపాయాలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

చంద్రముఖి 2 చిత్రం 5వ రోజున కూడా భారీ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు అక్టోబర్ 2 సెలవు దినం కావడంతో బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 30 శాతం అక్యుపెన్సీ, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్ షోకు 35 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

 Chandramukhi 2 box office Report 50

చంద్రముఖి 2 సినిమా 5వ రోజు నిలకడగానే వసూళ్లను సాధించడానికి సిద్దమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 5వ రోజున 6 కోట్లకుపైగా కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 41 కోట్లకుపైగా 5 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలివారంలో 50 కోట్లకు చేరుగా కానున్నది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X