For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chakra 3rd day Collections: విశాల్‌కు ఊహించని పోటి.. అయినా స్టడీగా బాక్సాఫీస్ వసూళ్లు

    |

    తమిళ నటుడు విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసండ్రా కాంబినేషన్‌లో వచ్చిన చక్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ చిత్రంపై ఉన్న అంచనాలను విశాల్ అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

    Chakra : Telugu Audience Are Always Says Actor Vishal

    అమీరా దస్తర్ క్లీవేజ్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్ మరింత బోల్డ్‌గా

    నిలకడగా చక్ర వసూళ్లు

    నిలకడగా చక్ర వసూళ్లు

    యాక్షన్, థ్రిల్లర్, మాస్ ఎలిమెంట్స్‌తో చక్ర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఇక సెకండాఫ్‌లో రెజీనా విలనిజం ఆడియెన్స్‌ను మెప్పించింది. విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్ ఉన్నాయి. దీంతో మాస్ ఆడియెన్స్‌కు ఈ చిత్రం కనెక్ట్ కావడంతో స్టడీగా వసూళ్లను సాధిస్తున్నది.

    3వ రోజు కలెక్షన్లు

    3వ రోజు కలెక్షన్లు

    చక్ర చిత్రం వారాంతంలో నిలకడగా కలెక్షన్లను రాబట్టడంతో బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా అడుగులేస్తున్నది. ఈ చిత్రం 3వ రోజున రూ.73 లక్షల నికర వసూళ్లను, రూ.1.32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక సినిమాలకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం కలెక్షన్లపైనే ఈ సినిమా హిట్టా? ఫట్టా అనేది ఆధార పడి ఉంటుంది.

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.27 లక్షలు, సీడెడ్‌లో రూ.12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.10 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలోరూ.6.2లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.4 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5.2 లక్షలు, నెల్లూరు జిల్లాలో 3 లక్షల రూపాయలు వసూలు చేసింది.

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే

    ఇదిలా ఉండగా, చక్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాంలో హక్కులను రూ.1.75 కోట్లు, సీడెడ్ రూ.75 లక్షలు, ఆంధ్రా రూ.2.4 కోట్ల మేర జరిగింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ.4.9 కోట్లుగా బిజినెస్ నమోదు అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.4 కోట్లు రాబట్టాల్సింది.

    చక్ర మూవీ లాభాల్లోకి రావాలంటే..

    చక్ర మూవీ లాభాల్లోకి రావాలంటే..

    చక్ర మూవీ రూ.5.4 కోట్ల లక్ష్యంతో థియేటర్లోకి వచ్చిన విశాల్ మూవీ ఇప్పటి వరకు రూ.2.6 కోట్లు రాబట్టింది. అంటే ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.2.8 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అంటే రానున్న రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

    English summary
    As per Wikipedia, Chakra movie is a action thriller film written and directed by MS Anandan in his directorial debut. The film stars Vishal, Shraddha Srinath and Regina Cassandra. The film is based on cybercrimes and e-commerce scams. This movie hits theatres on Feb 19, 2021. Chakra movie 3rd day collections are here
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X