twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chakra 4th Overseas collections: విశాల్ మూవీ హిట్టా? ఫట్టా? నాంది, పొగరు నుంచి గట్టి పోటి!

    |

    యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం చక్ర థియేటర్లలో సందడి చేస్తున్నది. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 19వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే తొలి వారాంతంలో మెరుగైన వసూళ్లను సాధించిన ఈ చిత్రం 4వ రోజున ఏ మేరకు కలెక్షన్లను రాబట్టిందంటే.. .

    అమీరా దస్తర్ క్లీవేజ్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్ మరింత బోల్డ్‌గా

    సైబర్ నేరాల కథాంశంతో

    సైబర్ నేరాల కథాంశంతో

    సైబర్ నేరాల కథాంశంతో రూపొందిన చక్ర మూవీ విడుదలకు ముందు మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసండ్రా లాంటి కాంబినేషన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. అయితే ఈ చిత్రానికి మొదటి ఆట నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా తొలి మూడు రోజుల్లో ఇతర చిత్రాల నుంచి పోటీని తట్టుకొని భారీ వసూళ్లను సాధించింది.

    సోమవారం క్షీణించిన కలెక్షన్లు

    సోమవారం క్షీణించిన కలెక్షన్లు

    ఇక ప్రతీ సినిమాకు అగ్ని పరీక్షగా మారే సోమవారం చక్ర మూవీ వసూళ్లు కాస్త తగ్గినట్టుగా కనిపించాయి. సాధారణంగా వర్కింగ్ డే కావడంతో ఇలా వసూళ్లు తగ్గడం మామూలే అనే విషయం తెలిసిందే. నాంది, పొగరు, ఉప్పెన లాంటి సినిమాలను తట్టుకొని మోస్తారు వసూళ్లను సాధించింది.

    4వ రోజున చక్ర కలెక్షన్లు ఇలా

    4వ రోజున చక్ర కలెక్షన్లు ఇలా

    ఇక చక్ర మూవీ నాలుగో రోజున.. నైజాంలో రూ.13 లక్షలు, సీడెడ్‌లో రూ.7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.4.6 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 2 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ. 2.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.2.3 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ. 2 లక్షల వసూళ్లు రాబట్టింది.

    చక్ర నాలుగు రోజుల వసూళ్లు

    చక్ర నాలుగు రోజుల వసూళ్లు

    ఇక చక్ర మూవీ నాలుగు రోజుల వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 98 లక్షలు, సీడెడ్‌లో రూ.35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.38 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.25 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 17 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ. 24 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.22 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.16 లక్షలు వసూలు చేసింది.

    చక్ర ఎంత సాధిస్తే బ్రేక్ ఈవెన్‌లోకి

    చక్ర ఎంత సాధిస్తే బ్రేక్ ఈవెన్‌లోకి

    ఇక చక్ర మూవీ విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో రూ.4.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే.. రూ.5.4 లక్షల లక్ష్యంతో బరిలోకి దిగింది. నాలుగు రోజుల్లో రూ.2.93 కోట్ల నికర, 5.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా రూ.2.4 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంది.

    English summary
    Chakra 4th day collections: Chakra movie is a action thriller film written and directed by MS Anandan in his directorial debut. The film stars Vishal, Shraddha Srinath and Regina Cassandra. The film is based on cybercrimes and e-commerce scams. This movie hits theatres on Feb 19, 2021. Chakra movie 4th day collections are here
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X