Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Chakra 5th day collections: బాక్సాఫీస్ వద్ద విశాల్ తడబాటు.. లాభాల్లోకి రావడం కష్టమేనా?
యాక్షన్ హీరో విశాల్, అందాల తారలు శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసండ్రా కాంబినేషన్లో వచ్చిన చక్ర విడుదలైన తొలి ఆట నుంచే డివైడ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. టాక్ ఎలా ఉన్నా ఫిబ్రవరి 19న రిలీజైన చిత్రాలతో పోల్చుకొంటే చక్ర మూవీ మంచి వసూళ్లను సాధించింది. అయితే 5వ రోజున దారుణంగా కలెక్షన్లను నమోదు చేసుకోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది. తాజా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సైబర్ క్రైమ్స్ నేపథ్యంగా
అభిమన్యుడు విజయం తర్వాత విశాల్ ఎక్కువగా సైబర్ క్రైమ్ నేపథ్యంగా సినిమా కథలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా వచ్చిన చక్ర కూడా సైబర్ నేరాల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో దేశభక్తి ఉన్న ఆర్మీ ఆఫీసర్‌గా విశాల్, సైబర్ నేరాలకు పాల్పడే యువతిగా రెజీనా విభిన్నమైన పాత్రలో కనిపించింది. ఇక శ్రద్దా శ్రీనాథ్ పోలీస్ పాత్రలో నటించారు.
50 శాతానికిపైగా క్షీణించిన కలెక్షన్లు
అయితే సైబర్ నేరాల కథను తొలిభాగంలో ఆసక్తిగా సాగడంతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే అంశంగా కనిపించింది. అయితే సెకండాఫ్‌లో కథ ఆకట్టుకోలేకపోయిందనే మాట బలంగా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య చక్ర తొలి వారాంతం బెటర్‌గానే వసూళ్లను నమోదు చేసింది. అయితే ఐదో రోజున 50 శాతం క్షీణించడం ఆలోచించాల్సిన విషయంగా మారింది.
5వ రోజున వసూళ్లు...
ఇక ఐదో రోజు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.4 లక్షలు, సీడెడ్‌లో రూ.2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.6 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వసూలు చేసింది.
ఐదు రోజుల మొత్తం కలెక్షన్లు
ఇక ఐదో రోజున చక్ర మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.15 లక్షలు నికర వసూళ్లు, రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 3.08 కోట్ల నికర వసూళ్లు, రూ.5.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.
చక్ర బ్రేక్ ఈవెన్ సాధించాలంటే...
ఇదిలా ఉంటే.. చక్ర మూవీ ఏపీ, తెలంగాణలో రూ.4.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లను చూస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అనిపిస్తున్నది. ఈ సినిమా నష్టాల్లో మునిగిపోకుండా ఉండాలంటే.. ఇంకా 2 కోట్లకుపైగానే వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.