Chakra day 1 collections: అంచనాలను మించిన విశాల్ మూవీ.. తొలి రోజు ఎంతంటే!
తమిళ హీరో విశాల్ నటించడమే కాకుండా స్వయంగా నిర్మించిన తాజా చిత్రం చక్ర. శ్రద్ధ శ్రీనాథ్, రెజీనా కంసాండ్రా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో రెజీనా తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే....

35 కోట్ల బడ్జెట్‌తో
దక్షిణాది సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతూ ఎంఎస్ ఆనందన్ రూపొందించిన చిత్రం చక్ర. ఈ చిత్రాన్ని సుమారు 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే లాక్‌డౌన్‌లో ఈ చిత్రం విడుదలకు రకరకాల సమస్యలను ఎదుర్కొన్నది. చివరకు నేరుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 19న రిలీజ్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఇలా...
తెలుగు రాష్ట్రాల్లో చక్ర మూవీ డీసెంట్ బిజినెస్ చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.1.75 కోట్లు, సీడెడ్‌లో రూ.75 లక్షలు, ఆంధ్రాలో రూ.2.4 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ చిత్రం మొత్తంగా రూ.4.90 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. గత చిత్రాలతో పోల్చుకొంటే విశాల్ మూవీకి అయిన బిజినెస్ తక్కువే అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో
తెలుగు రాష్ట్రాల్లో విశాల్‌కు ఉన్న క్రేజ్‌తో చక్ర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని ఏరియాలో బిజినెస్ కూడా మంచి జరగడంతో ఓపెనింగ్స్‌పై కూడా ఆశలు పెట్టుకొన్నారు. కానీ తెలుగులో నాంది, కపటధారి, కన్నడ డబ్బింగ్ సినిమా పొగరు కూడా రిలీజ్ కావడంతో భారీ పోటీని ఎదుర్కొన్నది. దాంతో 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనే విషయం చర్చనీయాంశమైంది.

నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో
ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చక్ర సినిమా మంచి ఒపెనింగ్స్ సాధించింది. నైజాంలో ఈ చిత్రం తొలి రోజున 32 లక్షల షేర్‌ను సాధించింది. అలాగే సీడెడ్‌లో రూ.19 లక్షలు నికర వసూళ్లను సాధించింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.14 లక్షలు రాబట్టింది.

ఆంధ్రాలో వసూళ్లు
ఇక ఆంధ్రా విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో రూ.9 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.2 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.10 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.9.6 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ. 7 లక్షల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.1.08 కోట్ల నికర వసూళ్లు, రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

చక్ర లాభాల్లోకి రావాలంటే
ఇక చక్ర సినిమా లాభాల్లోకి రావాలంటే మొత్తంగా రూ.5.5 కోట్ల నికర వసూళ్లను సాధించాలి. తొలి రోజు రూ.1.08 కోట్లు సాధించడంతో ఈ సినిమా ఇంకా రూ.4.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. తొలి వీకెండ్‌తోపాటు రానున్న రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











