Champion Closing Collections: ఛాంపియన్ క్లోజింగ్ కలెక్షన్స్.. రోషన్ మూవీకి భారీ నష్టాలు, ఎన్ని కోట్లంటే?

రోషన్ మేకా, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ఛాంపియన్. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఛాంపియన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? రోషన్ మేకా మూవీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే...

దాదాపు 36 సంవత్సరాల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఈ ఛాంపియన్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు కోవై సరళ, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, కృతి కాంజ్ సింగ్ రాథోడ్, భవానీ నీరటి, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్.. మదీ సినిమాటోగ్రఫి అందించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.

Champion Box Office Closing Collections Worldwide How much loss or profit for Roshan Meka s Movie

ఛాంపియన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఛాంపియన్ మూవీకి దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్ నేపథ్యంలో రోషన్ మేకా మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ తదితర ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలిపి ఛాంపియన్ మూవీకి 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఛాంపియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్‌కు మంచి ధర పలికినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల రూపాయల షేర్.. 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. రోషన్ మేకా మూవీని తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్‌లలో, రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 1300కు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

ఛాంపియన్ కలెక్షన్స్
రోషన్ మేకా మూవీకి తొలిరోజున 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 75 లక్షల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 65 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 1.1 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియాలో ఇప్పటి వరకు 10.85 కోట్ల రూపాయల నెట్.. 12.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఛాంపియన్.

ఓవర్సీస్‌లో ఛాంపియన్ మూవీకి ఓ మోస్తరుగా కలెక్షన్స్ వచ్చాయి. గురువారం వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 186K డాలర్లు (భారత కరెన్సీలో 1.67 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలలో ఈ సినిమా మరో 60 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ఛాంపియన్ మూవీ 2.30 కోట్ల వరకు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్+ ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఛాంపియన్‌కు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ఛాంపియన్‌కు లాభమెంత? నష్టమెంత?
మంచి సబ్జెక్ట్‌, ప్రేమకథతో వచ్చిన ఛాంపియన్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదే సమయంలో దండోరా, శంబాల, ఈషాలతో పాటు దురంధర్, అవతార్ 3, అఖండ 2 వంటి భారీ చిత్రాలు బరిలో ఉన్న సమయంలో రిలీజ్ కావడంతో ఛాంపియన్‌కు మైనస్‌గా మారింది. విపరీతమైన పోటీలో విడుదల కావడం ఈ సినిమాను గట్టి దెబ్బకొట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. న్యూఇయర్ రోజున తిరిగి గాడిలో పడినట్లు కనిపించగా.. ఆ మరుసటి రోజు నుంచి ఛాంపియన్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.

23 కోట్ల రూపాయల షేర్‌ రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఛాంపియన్ 8 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూషన్ మీద దాదాపు 15 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అలాగే 46 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉండగా.. 15 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి గ్రాస్ కలెక్షన్స్ పరంగా 30 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. త్వరలో సంక్రాంతి సీజన్ మొదలు కానుండటం.. బరిలో పెద్ద సినిమాలు ఉండటంతో ఛాంపియన్ థియేట్రికల్ రన్ ఈ ఆదివారంతో దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. ఈ సినిమాకు మూడు నిర్మాణ సంస్థలు దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బడ్జెట్‌లో కేవలం 30 శాతం మాత్రమే రికవరీ చేసి దాదాపు 30 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది ఛాంపియన్. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ హక్కుల కింద జరిగిన నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు స్వల్ప నష్టాలతో బయటపడే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: box office report roshan meka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X