Champion Day 3 Collections: షాకింగ్‌గా ఛాంపియన్ కలెక్షన్స్.. రోషన్ మేకా సినిమా లాభాల్లోకి రావాలంటే?
రోషన్ కనకాల హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఛాంపియన్. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్‌లు సంయుక్తంగా ఈ ఛాంపియన్ మూవీని నిర్మించారు. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఛాంపియన్‌లో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు కోవై సరళ, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, కృతి కాంజ్ సింగ్ రాథోడ్, భవానీ నీరటి, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఛాంపియన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. మదీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫి అందించారు. డిసెంబర్ 25న ఛాంపియన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఛాంపియన్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

ఛాంపియన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఛాంపియన్ మూవీకి దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్ నేపథ్యంలో రోషన్ మేకా మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ తదితర ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలిపి ఛాంపియన్ మూవీకి 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఛాంపియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల రూపాయల షేర్.. 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. రోషన్ మేకా మూవీని తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్‌లలో, రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 1300కు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు.
ఛాంపియన్ రెండు రోజుల కలెక్షన్స్
రోషన్ మేకా మూవీకి తొలిరోజున 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియా వైడ్‌గా ఈ సినిమాకు 4.25 కోట్ల రూపాయల నెట్.. 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఛాంపియన్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... గురువారం వరకు అందిన సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో రోషన్ మేకా మూవీకి 81K డాలర్లు (భారత కరెన్సీలో (72.75 లక్షల రూపాయలు) వసూలైంది. ఇతర దేశాలో మరో 10 లక్షల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఛాంపియన్‌కు ఓవర్సీస్‌లో 83 లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ పీరియాడికల్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల్లో 5.85 కోట్ల రూపాయల వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఛాంపియన్ మూవీకి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 6.91 కోట్ల రూపాయలు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
ఛాంపియన్ 3వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో ఈ సినిమాకు 3వ రోజు ఓ మోస్తరుగా బుకింగ్స్ జరుగుతున్నాయి. శంబాల, దండోరా, ఈషా తదితర సినిమాల నుంచి ఈ చిత్రానికి టఫ్ ఫైట్ ఎదురవుతోంది. ఛాంపియన్ మూవీకి శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి ఈ సినిమాకు ఇండియాలో 3వ రోజు 31 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. 3వ రోజు రోషన్ మేకా మూవీకి వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని భావిస్తున్నారు. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 18 కోట్ల రూపాయల షేర్.. 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











