Champion Day 6 Collections: నష్టాల్లో ఛాంపియన్... రోషన్ మూవీకి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ , నటి ఊహా దంపతుల నట వారసుడు రోషన్ మేకా హీరోగా తెరకెక్కిన చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. అనస్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు కోవై సరళ, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, కృతి కాంజ్ సింగ్ రాథోడ్, భవానీ నీరటి, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది తదితరులు కీలకపాత్రలు పోషించారు.
మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. మదీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫి అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఛాంపియన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరో రోజు ఛాంపియన్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

ఛాంపియన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఛాంపియన్ మూవీకి దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్ నేపథ్యంలో రోషన్ మేకా మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ తదితర ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలిపి ఛాంపియన్ మూవీకి 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఛాంపియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల రూపాయల షేర్.. 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. రోషన్ మేకా మూవీని తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్‌లలో, రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 1300కు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు.
ఛాంపియన్ 5 రోజుల కలెక్షన్స్
రోషన్ మేకా మూవీకి తొలిరోజున 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 75 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఐదు రోజుల్లో ఇండియా వైడ్‌గా ఈ సినిమాకు 8.45 కోట్ల రూపాయల నెట్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఛాంపియన్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఆదివారం వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నార్త్ అమెరికాలో 147 డాలర్లు (భారత కరెన్సీలో 1.32 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇతర దేశాలలో మరో 70 లక్షల రూపాయల వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో ఓవర్సీస్‌లో ఛాంపియన్ మూవీ 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఛాంపియన్ మూవీకి 5 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే వరల్డ్ వైడ్‌గా 5 రోజుల వరకు ఈ సినిమాకు 12.51 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఛాంపియన్ 6వ రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు ఎలాగో నెట్టుకొచ్చిన ఛాంపియన్ మూవీ... వర్కింగ్ డే టెస్ట్‌లో ఫెయిలైంది. సోమవారం ఇండియాలో కేవలం 75 లక్షల రూపాయల నికర వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక మంగళవారం ఈ సంఖ్య మరింత తగ్గినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 6వ రోజైన మంగళవారం ఛాంపియన్ మూవీకి సాయంత్రం 4 గంటల వరకు 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసింది. దురంధర్, శంబాల, దండోరా, ఈషా తదితర చిత్రాల నుంచి ఛాంపియన్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
కడపటి సమాచారం మేరకు ఛాంపియన్ మూవీకి 6వ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇండియాలో కేవలం 25 లక్షలు మాత్రమే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా మంగళవారం ప్రపంచవ్యాప్తంగా 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. దాంతో 6 రోజుల వరకు ఛాంపియన్ మూవీ వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 16 కోట్ల రూపాయల షేర్.. 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











