Chand Mera Dil Day 1 Collections: చాంద్ మేరా దిల్ కలెక్షన్స్.. అనన్య పాండే మూవీకి తొలి రోజు ఎంతంటే?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే, యువ హీరో లక్ష్య నటించిన మూవీ చాంద్ మేరా దిల్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరూ యష్ జోహర్, కరణ్ జోహర్, ఆదార్ పూరన్‌వాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మర్జికే డిసౌజా తదితరులు నిర్మాతలుగా వ్యవహరించి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకుడిగా వ్యవహరించారు.ఆస్తా సింగ్, ప్రథమ్ రాథోడ్, ఆశీష్ దూబే, అంకుర్ పోద్దార్, ఎల్వీస్ జోష్ తదితరులు నటించారు.
చాంద్ మేరా దిల్ తారాగణం
దెబోజిత్ రే సినిమాటోగ్రాఫర్‌గా, ప్రశాంత్ రాంచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సచిన్ జిగర్, సచిన్ సాంఘ్వి, జిగర్ సారైయా తదితరులు సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా మే 22వ తేదిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చాంద్ మేరా దిల్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

చాంద్ మేరా దిల్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాకు 46 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ విలువల పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. టీజర్, ట్రైలర్లతో పాటు వివేక్ సోని ట్రాక్ రికార్డ్ దృష్ట్యా చాంద్ మేరా దిల్ మూవీపై హైప్ నెలకొంది. ఊహించని విధంగా కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి మరి చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్‌ను ఆశ్రయించింది. దాంతో చాంద్ మేరా దిల్ మూవీకి రన్‌టైం 135.36 నిమిషాల నుంచి 145.53 నిమిషాలు (2 గంటల 25 నిమిషాలు)కు చేరుకుంది.
చాంద్ మేరా దిల్ అడ్వాన్స్ బుకింగ్
అయితే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయింది. తొలిరోజు ఉదయం దేశవ్యాప్తంగా 402 షోలకు గాను 32 వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. తద్వారా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ముంబైతో పాటు దేశంలోని కీలక నగరాల్లో చిన్న చిన్న కారణాలతో అడ్వాన్స్ బుకింగ్ ఆలస్యం కావడం కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చాంద్ మేరా దిల్ తొలిరోజు కలెక్షన్స్
చాంద్ మేరా దిల్‌కు తొలిరోజున మధ్యాహ్నం 2 గంటల వరకు దేశవ్యాప్తంగా 2309 షోలు ప్రదర్శితమై 12 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఢిల్లీలో 750 షోలు, ముంబైలో 412 షోలు, అహ్మదాబాద్‌లో 318 షోలు, సూరత్‌లో 189 షోలు, బెంగళూరులో 19 షోలు, పూణేలో 156 షోలు చొప్పు ప్రదర్శితమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చాంద్ మేరా దిల్‌కు ఫస్ట్ డే ఇండియాలో కోటి రూపాయల గ్రాస్.. 78 లక్షల రూపాయల నెట్ వసూలైంది. ట్రెండ్స్‌ను బట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications


