Chandramukhi 2 Collections బాక్సాఫీస్ వద్ద చంద్రముఖి 2 ఊగిసలాట.. నష్టాల నుంచి బయటపడాలంటే?

దక్షిణాది సినిమా పరిశ్రమలో 17 ఏళ్ల క్రితం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం చంద్రముఖి 2. ప్రముఖ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత లారెన్స్ రాఘవ, యువ హీరోయిన్ మహిమ నంబియార్, వడివేలు తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 28వ తేదీన బ్రహ్మండంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

చంద్రముఖి 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు 65 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ దాదాపుగా 50 కోట్ల మేర జరిగింది. ఇక సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌‌తో బజ్ క్రియేట్ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు.

Chandramukhi 2 Movie 6 days collections Worldwide: Kangana Ranaut movie struggiling at box office

చంద్రముఖి 2 సినిమా విడుదల తర్వాత మిక్స్‌డ్ రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. కంటెంట్‌లో కొత్తదనం లేకపోవడం వల్ల చంద్రముఖి స్థాయి ఫలితాన్ని అందించలేకపోయిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. రిలీజ్‌కు ముందు వచ్చిన రెస్సాన్స్.. విడుదల తర్వాత కొనసాగించలేకపోయింది. అయినా లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసి వచ్చింది.

ఇండియాలో అంటే తమిళం, తెలుగు, హిందీలో కలిపి చంద్రముఖి 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 8.3 కోట్లు, రెండో రోజు 4.35 కోట్లు, మూడో రోజు 5 కోట్లకుపైగా, నాలుగో రోజు 7 కోట్లు, ఐదో రోజు 4.6 కోట్లు, ఆరో రోజు 2 కోట్లకుపైగా నికరంగా, 4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 31 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.

Chandramukhi 2 Movie 6 days collections Worldwide: Kangana Ranaut movie struggiling at box office

ప్రపంచవ్యాప్తంగా చంద్రముఖి 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళంలో ఈ చిత్రం 24 కోట్ కోట్ల గ్రాస్, ఆంధ్రప్రదేశ్‌లో 8 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 2.5 కోట్లకుపైగా గ్రాస్, కేరళలో 1 కోటి గ్రాస్, మిగితా రాష్ట్రాల్లో 1.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 6 రోజుల్లో 46 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

Chandramukhi 2 Movie 6 days collections Worldwide: Kangana Ranaut movie struggiling at box office

తమిళనాడులో చంద్రముఖి 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమాకు చిత్తా, ఇరైవన్ లాంటి సినిమాల నుంచి భారీ పోటీ ఉన్నప్పటికీ.. భారీగా వసూళ్లను నమోదు చేసింది. 2023 సంవత్సరంలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన 9వ చిత్రంగా ఈ సినిమా ఘనతను సాధించింది.

Chandramukhi 2 Movie 6 days collections Worldwide: Kangana Ranaut movie struggiling at box office

ఇక చంద్రముఖి 2 సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..లారెన్స్ రాఘవ సినిమా ముందు భారీ లక్ష్యమే కనిపిస్తున్నది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగితే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X