Chandramukhi 2 collections లారెన్స్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు కాంబినేషన్‌లో పీ వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ సూపర్ హిట్ సినిమాకు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి 2 సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్ల వివరాలు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
చంద్రముఖి మూవీ సీక్వెల్‌గా :చంద్రముఖి సీక్వెల్‌గా చంద్రముఖి 2 సినిమాను దర్శకుడు పీ వాసు తెరకెక్కించారు. లారెన్్ రాఘవ, కంగన రనౌత్, మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డును అందుకొన్న ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సినిమాపై క్రేజ్ పెంచడంతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చంద్రముఖి 2 బడ్జెట్, బిజినెస్:చంద్రముఖి 2 సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు మొత్తంగా 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తమిళంలో 35 కోట్ల రూపాయలు, తెలుగు రైట్స్ 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయింది.

చంద్రముఖి బ్రేక్ ఈవెన్, స్క్రీన్ కౌంట్:చంద్రముఖి 2 సినిమా 45 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో థియేట్రికల్ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లలో, తెలుగులో 250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 54 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో 70 శాతం ఆక్యుపెన్సీ, మధురైలో 60 శాతం, పాండిచ్చేరిలో 82 శాతం, వెల్లూరులో 70 శాతం, త్రిచీ 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

చంద్రముఖి 2 తమిళనాడు ఆక్యుపెన్సీ :చంద్రముఖి 2 తెలుగు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం కావడం వల్ల ఆక్యుపెన్సీ తక్కువగా నమోదైంది. గుంటూరులో 86 శాతం, వైజాగ్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 40 శాతం, కాకినాడలో 52 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

చంద్రముఖి 2 తెలుగు ఆక్యుపెన్సీ :చంద్రముఖి 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగానే స్పందన కనిపించింది. ఓవర్సీస్‌లో 100K డాలర్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్‌గా రాబట్టింది. ఇక కరెంట్ బుకింగ్‌తో కలిపి ఓవర్సీస్‌లో 150k డాలర్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ఈ సినిమా 6 కోట్లు, వసూలు చేయవచ్చు. తెలుగులో 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా లారెన్స్ కెరీర్‌లో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే? :ప్రపంచవ్యాప్తంగా చంద్రముఖి 2 సినిమా భారీగానే వసూళ్లు నమోదు చేయవచ్చు. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 45 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వస్తుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











