Chandramukhi 2 day 2 collections నెగిటివ్ టాక్‌లోను షాకింగ్‌గా కలెక్షన్లు..చంద్రముఖి 2కి ఎన్ని కోట్లంటే?

యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నిర్మాత రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, యువ హీరోయిన్ మహిమా నంబియార్ కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం చంద్రముఖి 2. 17 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 సినిమాను ప్రముఖ దర్శకుడు పీ వాసు రూపొందించారు. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నది? బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ బిజినెస్: చంద్రముఖి 2 సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో టాప్ యాక్టర్లు నటించడం, ఉత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. దాదాపు ఈ సినిమాను 65 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాను బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తమిళంలో 35 కోట్ల రూపాయలు, తెలుగులో 10 కోట్ల రూపాయలతో 45 కోట్ల బిజినెస్ జరిగింది.

Chandramukhi 2 movie Day 2 expected collections Worldwide: Kangana Ranaut movie registered decent collections

చంద్రముఖి 2 స్క్రీన్ కౌంట్: చంద్రముఖి 2 సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించడంతో సినిమాపై మంచి క్రేజ్, బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, తెలుగులో 250 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2000 స్క్రీన్లలో విడుదల చేశారు.

Chandramukhi 2 movie Day 2 expected collections Worldwide: Kangana Ranaut movie registered decent collections

చంద్రముఖి 2 తొలి రోజు కలెక్షన్లు: చంద్రముఖి 2 సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 8.25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. తమిళంలో 5.6 కోట్లు, తెలుగులో 3 కోట్లు, హిందీలో 17 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 60 లక్షల రూపాయలు, కేరళలో 30 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 45 లక్షల రూపాయలు రాబట్టింది. ఒక ఓవర్సీస్‌లో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Chandramukhi 2 movie Day 2 expected collections Worldwide: Kangana Ranaut movie registered decent collections

చంద్రముఖి 2 రెండో రోజు ఆక్యుపెన్సీ: ఇక చంద్రముఖి 2 సినిమాకు మిక్స్‌డ్ రెస్సాన్స్ రావడంతో ఆక్యుపెన్సీ విషయంలో ఊగిసలాట కనిపించింది. రెండో రోజు తమిళ వెర్షన్‌కు 25 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 40 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 40 శాతానికిపైగా ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు వెర్షన్‌కు 20 శాతానికిపైగా ఆక్యుపెన్సీ, మ్యాట్నీకిి 25 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Chandramukhi 2 movie Day 2 expected collections Worldwide: Kangana Ranaut movie registered decent collections

చంద్రముఖి 2 రెండో రోజు కలెక్షన్లు: చంద్రముఖి 2 రెండో రోజు కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకుపైగా గ్రాస్, 4.35 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. తమిళంలో 3.9 కోట్లు, ఆంధ్రా ప్రదేశ్‌లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 30 లక్షల రూపాయలు, కేరళలో 25 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది.

Chandramukhi 2 movie Day 2 expected collections Worldwide: Kangana Ranaut movie registered decent collections

చంద్రముఖి 2 లాభాల్లోకి రావాలంటే?: చంద్రముఖి 2 సినిమా భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. సుమారుగా 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు రోజుల్లో ఈ చిత్రం 20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 14 కోట్ల షేర్‌ను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X