Chandramukhi 2 Day 3 Collections ట్రేడ్ వర్గాలకు షాకిస్తున్న చంద్రముఖి 2 కలెక్షన్లు..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నిర్మాత లారెన్స్ రాఘవ, అందాల తార మహిమ నంబియార్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు పీ వాసు రూపొందించిన చిత్రం చంద్రముఖి 2. 17 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
అయితే నెగిటివ్ టాక్‌లోను ఈ సినిమా నిలకడగా సాధిస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత? మూవీ సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

2000 స్క్రీన్లలో చంద్రముఖి 2: చంద్రముఖి 2 సినిమా సుమారుగా 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ దాదాపుగా 45 కోట్లకుపైగా జరిగింది. ఇక ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. లారెన్స్ రాఘవ కెరీర్‌లో అత్యధికంగా రిలీజైన సినిమాగా చంద్రముఖి 2 ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్, ప్రమోషన్ ఈవెంట్స్‌కు భారీ బజ్ క్రియేట్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగింది.

చంద్రముఖి 2 తొలి రోజు కలెక్షన్లు: చంద్రముఖి 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు తమిళంలో 5.6 కోట్ల రూపాయల షేర్, తెలుగులో 2.5 కోట్ల రూపాయల షేర్ 3 కోట్ల గ్రాస్, హిందీలో 17 లక్షలు, కర్ణాటకలో 60 లక్షల గ్రాస్, కేరళలో 40 లక్షల గ్రాస్, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 2.3 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

చంద్రముఖి 2 రెండో రోజు వసూళ్లు: రెండో రోజు చంద్రముఖి 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 3.5 కోట్లు నికరంగా, తెలుగులో 90 లక్షల రూపాయలు నికరంగా, హిందీలో 10 లక్షలు, కేరళలో 25 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 25 లక్షలు, ఓవర్సీస్‌లో 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

చంద్రముఖి 2 మూడో రోజు బాక్సాఫీస్ రిపోర్టు: ఇక చంద్రముఖి 2 సినిమా మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో 4.9 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో 4 కోట్ల రూపాయలు, తెలుగులో 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, కేరళలో 25 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 25 లక్షల రూపాయలు వసూలు చేసింది.

చంద్రముఖి 2 లాభాల్లోకి రావాలంటే?: గత మూడు రోజుల్లో చంద్రముఖి 2 సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొత్తంగా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 20 కోట్ల గ్రాస్, నైజాంలో 5.5 కోట్లు, కర్ణాటకలో 1.4 కోట్ల రూపాయలు, కేరళలో 80 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 40 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











