Chandu Champion Collections: 120 కోట్ల బడ్జెట్.. చందు ఛాంపియన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ నాడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నాడియావాలా నిర్మించిన చిత్రం చందు ఛాంపియన్. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన స్పోర్డ్స్ డ్రామా జూన్ 14 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఆర్యన్, విజయ్ రాజ్, భువన్ అరోరా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
చందు ఛాంపియన్ సినిమా కథ విషయానికి వస్తే.. మురళీకాంత్ పటేకర్ అనే పారా ఒలంపిక్ క్రీడాకారుడి జీవిత కథ. పారా ఒలంపిక్ క్రీడల్లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు. మరళీకాంత్ పెటేకర్‌గా కార్తీక్ ఆర్యన్ నటించారు. ఈ పాత్ర కోసం తన దేహధారుడ్యాన్ని, లుక్‌ను పూర్తిగా మార్చేసుకోవడం విశేషం.

ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. లండన్, జమ్ము, కాశ్మీర్, ఇండియాలో పలు ప్రదేశాల్లో ఈ సినిమాను రిచ్‌గా రూపొందించారు. చాలా మంది నటీనటులు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులను కలిపితే మొత్తంగా 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
చందు ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఇక చందు ఛాంపియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ మూవీ 5.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఆర్టికల్ 370, యోధ లాంటి సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధించింది. వారాంతంలో ఈ సినిమా తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











