రేర్ రికార్డ్ రిపీట్ చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాక్సాఫీసు వద్ద తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు. గతంలో మగధీర చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టి ఎవరూ అందుకోలేనంత ఎత్తులో రికార్డులు నెలకొల్పిన సత్తా చెర్రీ ఒక్కడికే దక్కింది. మగధీరం చిత్రం అప్పట్లో విడుదలైన 10 టెర్రిటరీలోనూ రూ. 3కోట్లుకు తక్కువగా కాకుండా షేర్ సాధించింది. ఇప్పటికీ అది రికార్డుగానే ఉంది. మళ్లీ ఏ తెలుగు సినిమాకు కూడా ఆ రికార్డు దరి దాపుల్లోకి చేరుకోలేదు.
తాజాగా.. మరో రేర్ రికార్డును నెలకొల్పాడు రామ్ చరణ్. అతడు నటించిన 'రచ్చ'చిత్రం విడుదలైన 10 టెర్రిటరీల్లోనూ రూ. 2 కోట్ల పై చిలుకు షేర్ సాధించి మగధీర తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ రెండు రికార్డులు చెర్రీకే దక్కడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ 10 టెర్రిటరీలు అనగా...నైజాం, సీడెడ్, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నాటక, ఓవర్సీస్. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఉన్న సినిమా మార్కెట్లలో ఈ 10 అతి ముఖ్యమైనవి. గబ్బర్ సింగ్ చిత్రం రచ్చ చిత్రం దరి దాపుల వరకు వచ్చి కొద్ది లో మిస్సయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
రామ్ చరణ్, తమన్నా జంటగా.... సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'రచ్చ' చిత్రాన్ని ఎన్.వి ప్రసాన్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆరెంజ్ చిత్రం ప్లాపుతో చాలా వెనక బడిపోయిన చెర్రీ 'రచ్చ' హిట్‌తో మళ్లీ గాడిలోకి వచ్చాడు.


Click it and Unblock the Notifications











