Chatrapathi day1 collections బెల్లంకొండ శ్రీనివాస్ స్థాయికి మించి టార్గెట్..తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ పరిశ్రమలో అడుగుపెడుతూ నటించిన చిత్రం ఛత్రపతి. ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్ ఛత్రపతి సినిమాను హిందీ రీమేక్‌గా దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కించారు.
హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్ బరుచా, శరద్ కేల్కర్, భాగ్యశ్రీ, పట్వర్ధన్, ఫ్రెడ్డీ దారువాలా తదితరులు నటించారు. మే 12వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పెన్ మీడియా లిమిటెడ్ బ్యానర్‌పై జయంతిలాల్ గడా నిర్మించారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

హిందీ మార్కెట్‌లో సాయి శ్రీనివాస్: సాయి శ్రీనివాస్‌కు హిందీ మార్కెట్‌లో భారీ ఆదరణ ఉంది. యూట్యూబ్‌లో ఆయన నటించిన తెలుగు డబ్బింగ్ చిత్రాలకు రికార్డు వ్యూస్ లభిస్తున్నాయి. దాంతో హిందీలో ఉన్న మార్కెట్‌కు అనుగుణంగా, ఛత్రపతి సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేశారు. కామెడీ ట్రాక్, లవ్ సీన్స్ తగ్గించి యాక్షన్ పార్ట్‌కు అధికంగా ప్రాధాన్యం ఇచ్చారనే విషయం స్పష్టం చేశారు.

ఛత్రపతిపై పెదవి విరిచిన బాలీవుడ్: అయితే భారీ అంచనాలతో ఉత్తర భారతంలో భారీగా రిలీజైన ఛత్రపతి హిందీ రీమేక్ బాలీవుడ్‌లో మెప్పించలేకపోయిందనే వార్తలు వెలువడుతున్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాపై పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా దాదాపు నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇక ఈ చిత్రం పూర్తిగా ప్రతికూల పరిస్థితుల మధ్య ముందుకు సాగుతున్నది.

ఛత్రపతి బడ్జెట్, స్క్రీన్ కౌంట్: ఛత్రపతి హిందీ రీమేక్ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్ అన్ని వ్యయాలతో కలిపి 50 కోట్లుగా విలువ కట్టారు. ఇక పెన్ మీడియా లిమిటెడ్ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను 2000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఓవర్సీస్‌లో మొత్తంగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఛత్రపతి హిందీ తొలి రోజు ఆక్యుపెన్సీ: ఛత్రపతి హిందీ మూవీ తొలి రోజు ఆక్యుపెన్సీ కూడా పెద్దగా నమోదు కాలేదు. ఉత్తరాదిలో మార్నింగ్ షోలకు 10 శాతం, మ్యాట్నీకి 10 శాతం, ఫస్ట్ షోకు 15 శాతం, సెకండ్ షోకు 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవరాల్‌గా తొలి రోజు ఈ చిత్రం 15శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఛత్రపతి తొలి రోజు కలెక్షన్ల అంచనా: ఛత్రపతి సినిమా తొలి రోజు ఆశించినంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి రోజు ఈ చిత్రం ఇండియాలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తొలి రోజు 1 కోటి రూపాయల నుంచి 1.5 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను నమోదు చేయవచ్చని అంచనా వేశారు.

ఛత్రపతి లాభాల్లోకి రావాలంటే?: ఛత్రపతి హిందీ రీమేక్ బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దాదాపు ఈ చిత్రం 75 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంది. దాంతో ఈ భారీ టార్గెట్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ రీచ్ అవుతాడా అనే విషయం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











